భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

PM Narendra Modi
ఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ పరిణామాల నేపథ్యంలో జీ7 సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. కెనడా ప్రధాని పిలుపుతో జీ7 సదస్సుకు హాజరుకావాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. జీ7 సదస్సులో భారత్, కెనడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ చర్చించనున్నారు. ఇవాళ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సైప్రస్‌లో భారత ప్రధాని తొలిసారి పర్యటించనున్నారు. 16,17వ తేదీల్లో కెనడాలో జరిగే జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. 18వ తేదీన క్రొయేషియా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఇరుద్దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.

