ఏపీ(Andhra Pradesh)లో గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం(AP Government) హయాంలో మద్యం కుంభకోణం పై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వియవాడ ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరైంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల(సెప్టెంబర్) 11వ తేదీన తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. కాగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. వైసీపీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.