Young woman boards plane without clothes.. Shocked passengers..

ఒక మహిళ మర్యాదపూర్వకంగా దుస్తులు ధరించినా కూడా అద్భుతంగా కనిపించవచ్చు. కానీ యువతి…సోషల్ మీడియాలో విమాన ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఎయిర్‌హోస్టెస్‌లు ప్రయాణికులు ఎలా సీటు అప్‌గ్రేడ్‌ చేయించుకోవాలో చెబుతారు, ఇంకొన్నిసార్లు విమాన సిబ్బంది, ప్రయాణికుల మధ్య జరుగుతున్న ఆసక్తికర సంఘటనలు చర్చనీయాంశం అవుతాయి. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. అందులో ఓ యువతి విమానంలో చాలా బోల్డ్‌గా, వెనుక భాగం పూర్తిగా ఓపెన్‌గా ఉండే డ్రెస్‌లో కనిపించింది. ఆ డ్రెస్ వెనుకభాగం సన్నని చైన్‌తో మాత్రమే కట్టబడి ఉండటంతో అక్కడున్న ప్రయాణికులు ఆమెను ఆశ్చర్యంగా చూశారు.ఫ్లోరిడాకు చెందిన అనబెల్ అకోస్టా (Anabel Acosta) అనే ఈ యువతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ @adriannaeves‌లో ఈ వీడియోను స్వయంగా షేర్‌ చేశారు. వీడియోలో ఆమె జీన్స్‌తో పాటు బ్యాక్‌లెస్ టాప్‌ ధరించి విమానం లోపల నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె పక్కన కూర్చున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, ఆమె ధరించిన డ్రెస్‌ ముందు భాగం కూడా బోల్డ్‌గానే ఉందని స్పష్టమవుతోంది. విమానంలో నడుస్తున్నప్పుడు తన జీన్స్‌ను సర్దుకుంటూ కనిపిస్తుంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *