ఇక్కడ పెసరట్టు ఉప్మా తినాలంటే క్యూ కట్టాల్సిందే… మీరెప్పుడైనా వెళ్లారా?

తేటగుంటలోని పూరిపాకలో పెసరట్టు ఉప్మా ఫేమస్. 50 ఏళ్లుగా న్యాచురల్‌గా తయారు చేస్తూ, సైకిల్ నుంచి కారులో వచ్చే వారందరూ ఇక్కడ ఆగి టేస్ట్ చేస్తారు.
ఒకచోట నుంచి మరొక చోటికి దేవాలయానికి లేదా ఒక పిక్నిక్ స్పాట్‌కి లేదా బంధువుల ఇంటికి వెళ్ళామా? అయితే మధ్యలో అల్పాహారం తీసుకోవాలని అనేకమంది చూస్తూ ఉంటారు. కుటుంబాలతో సరదా సరదాగా అక్కడ గడుపుదాం అనుకుంటారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా అనేక ఫైవ్ స్టార్ టూ స్టార్ వంటి హోటళ్లు హై రేంజ్లో ఉన్నప్పటికీ ఆ జిల్లాలో మాత్రం పూరిపాకల్లో అందించే టిఫిన్ వెరీ ఫేమస్ అంటున్నారు. అంతే కాదండోయ్, సైకిల్‌పై వచ్చే పెద్దాయన నుంచి కారుపై వచ్చే అపర కోటీశ్వరుడు వరకు ఆ జిల్లాలో ఆ గ్రామంలో ఆగుతూ అక్కడ చక్కని టిఫిన్ తింటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇంతకీ అంతలా ఫేమస్ ఆ టిఫిన్ ఎందుకయింది? అక్కడ దొరికే ఒకే ఒక ఐటమ్ ఏమిటి అనుకుంటున్నారా? రండి ఆ విశేషాలు ఏమిటో చూద్దాం.
ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటేనే అభిరుచులు. అభిరుచులు అంటేనే ఉమ్మడి గోదావరి జిల్లాలని చెప్పుకోవచ్చు. ఎక్కడ దొరకని అనేక రకాల న్యాచురల్ వంటకాలు తినాలి అంటే గోదావరి జిల్లాలోనే తినాలి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి తగ్గట్టుగా కాకినాడ జిల్లా తేటగుంటలో చిట్టిపొట్టి పెసరట్టు పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో దాదాపు 50 సంవత్సరాల కిందట ఒరిజినల్‌గా పెసలను రోలులో రుబ్బి వేడివేడిగా కట్టెల పొయ్యిపై కాల్చి కొనుగోలుదారులకు తయారుచేసి అందించేవారట. అందుకని ఈ తేటగుంట పెసరట్టు ఉప్మా అంటే న్యాచురల్ ఫుడ్ అని వేలాదిగా తింటూ ఉంటారు.

