Yellow Teeth: పళ్లు గార పట్టి పచ్చగా మారాయా..? తెల్లగా మెరవాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి..!

Yellow Teeth: ఇంట్లోనే తయారు చేసే నేచురల్ టూత్‌పేస్టుతో దంతాలపై పసుపు మరకలు పోయి, తెల్లగా మెరుస్తాయి. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ. Yellow Teeth: మన చిరునవ్వు మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆ చిరునవ్వు పసుపు రంగు పళ్లతో (Yellow teeth) ఉంటే అది అందాన్ని తగ్గించడమే కాక ఇబ్బందికరంగానూ అనిపిస్తుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, కొన్ని ఆహారపు అలవాట్లతో పళ్లు గార పట్టి పసుపు రంగులోకి మారుతాయి.
మార్కెట్లో అనేక టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నా.. ఈ సమస్యను అవి అంత ఎఫెక్టివ్‌గా తొలగించలేవు. అయితే ఇంట్లోనే తయారు చేసే నేచురల్ టూత్‌పేస్టుతో దంతాలపై పసుపు మరకలు పోయి, తెల్లగా మెరుస్తాయి. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ. ఆయుర్వేద మిశ్రమం
పళ్లు పచ్చగా మారితే, దీనికి పరిష్కారంగా ఒక ప్రత్యేకమైన టూత్‌పేస్ట్ వాడాలి. దీన్ని సాధారణంగా ఇంట్లో లభించే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. ఈ పేస్టును రెగ్యులర్‌గా వాడితే కొన్ని రోజుల్లోనే పళ్లు తెల్లగా మారుతాయి. ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీయకుండా సేఫ్‌గా పని చేస్తుంది. ఇందులో వాడే పదార్థాలన్నీ నేచురల్‌గా లభించేవే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే భయం కూడా అక్కర్లేదు.
అవసరమైన పదార్థాలు
ఈ ప్రత్యేక టూత్‌పేస్ట్‌ను తయారు చేయడానికి కొన్ని సాధారణ వస్తువులు అవసరం. అవేంటంటే.. 2 టీస్పూన్ల సోంపు, ఒక గుప్పెడు వేప ఆకులు, 5 లవంగాలు, అర టీస్పూన్ బేకింగ్ సోడా, 5 టీస్పూన్ల పొడి టూత్‌పేస్ట్ (మీరు రెగ్యులర్‌గా వాడేది), 2 టీస్పూన్ల అతిమధురం పొడి (ములేఠీ), ఒక చిటికెడు శొంఠి (ఎండు అల్లం పొడి), 2 చిటికెడు పటిక (ఫిట్‌కిరి).
తయారీ విధానం
ముందుగా, వేప ఆకులు, సోంపు, లవంగాలను కలిపి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో మీరు వాడే పొడి టూత్‌పేస్ట్, అతిమధురం పొడి, శొంఠి, పటిక వేసి బాగా కలపాలి. ఇప్పుడు అన్ని పదార్థాలు సమానంగా కలిసిపోయి నేచురల్ టూత్‌పేస్ట్ రెడీ అవుతుంది. ఈ మిశ్రమాన్ని గాలి దూరని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.వాడే పద్ధతి
ఈ టూత్‌పేస్ట్‌ను ప్రతి రాత్రి నిద్రపోవడానికి ముందు వాడాలి. మీ టూత్ బ్రష్‌పై కొద్దిగా తీసుకుని పళ్లను మామూలుగా బ్రష్ చేయండి. దీని వల్ల పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఫుడ్ వేస్టేజ్ బయటకు వస్తుంది. ఆ తరువాత మిగిలిన టూత్‌పేస్ట్‌ను మీ వేలితో పళ్లపై సున్నితంగా 2 నుంచి 3 నిమిషాల పాటు రుద్దాలి.

ఇలా రెగ్యులర్‌గా చేస్తే పళ్లపై పేరుకుపోయిన పసుపు (Yellow teeth) పొర క్రమంగా తొలగిపోయి కొన్ని రోజుల్లోనే దంతాలు ముత్యాల్లా మెరిసిపోతాయి. పళ్లు క్లీన్ చేసుకోవడంతో పాటు నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.ఎక్స్‌ట్రా టిప్స్
పళ్లు తెల్లగా (Yellow teeth) మెరవడానికి ఈ హోం రెమెడీతో పాటు మరికొన్ని అలవాట్లు పాటించవచ్చు. కాఫీ, టీ, రెడ్ వైన్ వంటివి పళ్లపై మరకలు ఏర్పడటానికి కారణం. ఇలాంటివి తాగడం తగ్గించడం బెటర్. అలాగే సిగరెట్లు, పొగాకు ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలి.
ఎందుకంటే ఇవి పళ్లను పసుపు రంగులోకి మారుస్తాయి. ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ వాడటం తప్పనిసరి. ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి.

