Yellow Teeth: ఇంటి చిట్కాలతో మెరిసిపోయే దంతాలు మీ సొంతం..! పసుపు మరకలకు ఇక బైబై చెప్పండి..!

దంతాలపై పసుపు మరకలు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. కాఫీ, టీ, సోడా వంటి పానీయాలు, సరైన దంత సంరక్షణ లేకపోవడం, ధూమపానం వంటి కారణాలు దీనికి కారణం. పసుపు మరకలను వదిలించడానికి బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి సహజ చికిత్సలు ఉపయోగించవచ్చు. తీవ్రమైన సమస్యల కోసం దంత వైద్యుడిని సంప్రదించండి. దంతాలపై పసుపు మరకల సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. ఇవి మన చిరునవ్వు అందాన్ని తగ్గించడమే కాక.. ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ పసుపు మరకలు చాలా రకాల కారణాలతో వస్తాయి. అవి దంత సంరక్షణ లోపం, ఆహారపు అలవాట్లు, వయస్సు, ధూమపానం, కొన్ని మందులు లేదా వైద్య పరిస్థితుల వల్ల కూడా రావచ్చు. అయితే ఈ సమస్యను కొన్ని సులభమైన మార్గాల ద్వారా పరిష్కరించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాలపై పసుపు మరకలకు గల కారణాలు
రోజూ బ్రష్ చేయకపోవడం వల్ల పసుపు మరకలు వస్తాయి. అలాగే కాఫీ, టీ, సోడా, రెడ్ వైన్ వంటివి దంతాలకు మరకలను కలిగిస్తాయి. ధూమపానం, పొగాకు అలవాట్లు దంతాలను పసుపు లేదా గోధుమ రంగులోకి మార్చుతాయి. వయస్సు పెరిగే కొద్దీ దంతాల ఎనామెల్ తగ్గిపోతుంది. దీని వల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాయి. కొన్ని రకాల మందులు కూడా దంతాల రంగును ప్రభావితం చేస్తాయి.
దంతాలపై పసుపు మరకలను తొలగించే సులభమైన పద్ధతులు
- రోజుకు రెండు సార్లు 2 నిమిషాల పాటు బ్రష్ చేయడం
- ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ వాడడం
- నాలుకను శుభ్రం చేయడం
ఆహారపు అలవాట్లలో మార్పులు
కాఫీ, టీ, సోడా, రెడ్ వైన్ వంటివి చాలా వరకు తగ్గియడం మంచిది. చక్కెర, ఆమ్లపు పదార్థాలను తీసుకోవద్దు. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది. నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి దంతాలను బ్రష్ చేయండి.
హైడ్రోజన్ పెరాక్సైడ్
ఇది నీటిలో కలిపి పుక్కిలించి ఉపయోగించవచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఇది దంతాలపై ఉన్న మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.
పసుపు
పసుపును నీటిలో కలిపి బ్రష్ చేయడం ద్వారా పసుపు మరకలను తొలగించవచ్చు.
ఆపిల్, క్యారెట్, సెలెరీ
ఆపిల్, క్యారెట్, సెలెరీ, కూరగాయలు దంతాలను సహజంగా శుభ్రం చేస్తాయి.
దంత వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం చాలా ముఖ్యం. దంత వైద్యుడు దంతాలపై ఉన్న గారను, మరకలను సమర్థవంతంగా తొలగించగలడు. ఇది మీ దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతులను పాటించడం ద్వారా దంతాలపై పసుపు మరకలను వదిలించుకోవచ్చు.

