Workout Side Effects: Are you working out too much? It’s like living with danger..

శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. బిజీ లైఫ్‌లో మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆఫీసులో గంటల తరబడి డెస్క్ వర్క్ చేస్తాం. ఎక్కువ సేపు సీట్లో కూర్చుంటాం.. దాని వల్ల మన శరీరం ఫిట్ గా ఉండదు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, హెల్తీ డైట్‌తో పాటు రోజువారీ వర్కవుట్‌లు చేయడం అవసరం. అయితే అధిక వ్యాయామం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసేపు వర్కవుట్ చేయడం వల్ల బీపీ ఎక్కువ కావడం తరచుగా కనిపిస్తుంది.

శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే అధిక వ్యాయామం కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువసేపు వర్కవుట్ చేయడం వల్ల బీపీ ఎక్కువ కావడం తరచుగా కనిపిస్తుంది. శరీరానికి వ్యాయామం అవసరం, కానీ అధిక వ్యాయామం కూడా మీ మరణానికి కారణం కావచ్చు.

వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా ప్రతి వారం కేవలం 75 నిమిషాల వ్యాయామం చేస్తే మీ శరీరం ఖచ్చితంగా ఫిట్‌గా ఉంటుంది. శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పరిమిత సమయం వరకు వ్యాయామం చేస్తే సరిపోతుంది. మీరు కూడా జిమ్ చేస్తే, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. తద్వారా వ్యాయామం మీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

బలవంతంగా వ్యాయామం చేయవద్దు: చాలమంది కండరాలు లేదా అబ్స్‌ కోసం లేదా బరువు తగ్గడానికి ఎక్కువ సమయం వ్యాయామం చేస్తుంటారు. ఇలా చేస్తే కొవ్వు త్వరగా కరిగిపోతుందని భావిస్తున్నారు. వ్యాయామంతో శీఘ్ర ప్రయోజనాలను పొందడానికి గంటల తరబడి వర్కౌట్స్ చేయడం  ప్రాణాంతకం. ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల బీపీ అధికం కావడం, కండరాలు పట్టేయడం, ఎముకలు బలహీనపడడం వంటివి జరుగుతాయి. మీ వ్యాయామం ఉపయోగకరంగా ఉండాలంటే 30 నుంచి 45 నిమిషాల పాటు మితమైన వేగంతో వ్యాయామం చేయండి.

ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల అలసట: అతిగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని చురుకుదనం పోయి అలసట వస్తుంది. ఎక్కువ సేపు వర్కవుట్ చేస్తే శరీరంలో బలహీనత పెడుతుంది. తొందరపడి వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోండి. శరీరం ఫిట్‌గా ఉండాలంటే 40-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *