మరో సారి చిరంజీవి తో జత కట్టనున్న ?

చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేశారు.

మెగా స్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ప్రాజక్టు లోకి నయనతార ఎంట్రీ ఇచ్చేసారు. ఈమేరకు తాజాగా చిత్ర యూనిట్ ఒక వీడియో షేర్ చేస్తూ స్వాగతం పలికింది. కొద్దీ రోజులు క్రితమే ఈ సినిమా పూజ కార్యక్రమములతో ప్రారంభోత్సవం జరిగింది. సాహూ గోరపాటి, సుష్మిత కొణిదల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రా’ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్ గా కనిపించుచున్నారనెల టాక్ వచ్చింది. భీమ్స్ సిసిరోలినా సంగీతం అందించుచున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
News by : V.L
