ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా సీరియల్ తారలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిత్యం అందం, అభినయంతో బుల్లితెరపై సందడి చేస్తున్న బ్యూటీలకు ఫాలోయింగ్ ఎక్కువే. అయితే స్క్రీన్ పై నటనతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మలు రియల్ లైఫ్ మాత్రం ఎన్నో కష్టాలతో నిండి ఉంటుంది.
ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమా తారల కంటే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అయితే స్మాల్ స్క్రీన్ పై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లు, కష్టాలను దాటుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారే. అందులో నైనిషా రాయ్ ఒకరు. బ్రహ్మాముడి సీరియల్లో అప్పు పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ తెలుగులో పలు సీరియల్స్ చేసి ఫేమస్ అయ్యింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, భాగ్యరేఖ, ఇంటిగుట్టు, హంసగీతం వంటి సీరియల్స్ చేసి పాపులర్ అయ్యింది. శ్రీమంతుడు అనే సీరియల్లో లీడ్ రోల్ పోషించిన నైనిషా.. అటు పలు సీరియల్స్ లో విలన్ పాత్రలతో ఇరగదీస్తుంది. పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తూ జనాలకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. అయితే అమ్మడు జీవితంలో ఎంతో దుఃఖం దాగుంది.
నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన తల్లిదండ్రులు ఏమాత్రం సపోర్ట్ చేయలేదట. తండ్రి లెక్చరర్ కాగా.. నటిగా మారతానంటే అస్సలు ఒప్పుకోలేదట. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించింది. కొన్ని సందర్భాల్లో తినడానికి తిండి లేక కడుపు నింపుకోవడానికి బ్లడ్ డొనేషన్ చేసిందట. ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్స్ అడిగేవారని..ఆఫర్ ఇచ్చాక నాకేంటీ అనేవారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

