What items should you donate after the eclipse, according to your zodiac sign?

రాష్ట్రవార్త :

పౌర్ణమి హిందూ మతంలోని ముఖ్యమైన తిథుల్లో ఒకటి, ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండటం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అయితే భాద్రప్రద మాసం పౌర్ణమి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి పితృ పక్షం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుంది.

ఈ సంవత్సరం భాద్రపద పూర్ణిమ సెప్టెంబర్ 7, 2025న వచ్చింది. పితృ పక్షం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:56 నుంచి తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక సూతక కాలం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో గ్రహణం తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదంతో పాటు.. గ్రహణ ప్రభావాల నుంచి రక్షణను కలిగిస్తుంది. నిలిచిపోయిన పనిని వేగవంతం అవుతాయి. అయితే ఏ రాశి వారు ఎటువంటి దానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.. తెలుసుకుందాం.

మేష రాశి వారు ఈ రోజున ఎర్ర పప్పు ధాన్యాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

వృషభ రాశి వారు తెల్లటి వస్తువులను దానం చేయాలి. ఈ సమయంలో పెరుగు లేదా బియ్యం కూడా దానం చేయవచ్చు. దీని ప్రభావం ఒత్తిడిని తగ్గిస్తుంది లేదా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మిథున రాశి వారు ఆకుపచ్చని దుస్తులు, పండ్లు లేదా ఇతర వస్తువులను దానం చేయాలి. ఇది రాశికి చెందిన వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి వారు చక్కెర మిఠాయి కలిపిన పాలను దానం చేయాలి. ఇది వీరి కెరీర్‌లో సానుకూల మార్పులను తెస్తుంది.

సింహ రాశి వారు బెల్లం దానం చేయాలి. ఇది సంబంధాలను మధురం చేస్తుందని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు.

కన్య రాశి వారు పెసలు దానం చేయాలి. ఇది జాతకంలో బుధుని స్థానాన్ని బలపరుస్తుంది.దీని కారణంగా వ్యాపారం, కమ్యూనికేషన్‌లో మంచి మార్పులు ఉంటాయి.

తుల రాశి వారు పాలు, బియ్యం, నెయ్యి దానం చేయాలి. ఇది వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఈ సమయంలో వీరు డబ్బును కూడా దానం చేయవచ్చు. ఇది గ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అదృష్టాన్ని పొందే అవకాశాన్ని కూడా సృష్టిస్తుంది.

ధనుస్సు రాశి వారు పప్పు ధాన్యాలను దానం చేయాలి. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

మకర రాశి వారు నల్ల నువ్వులను దానం చేయాలి. ఇది జాతకంలో శని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. వివాదాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కుంభ రాశి వారు నల్ల నువ్వులను , నూనెను దానం చేయాలి. ఇది వీరి కోరికలన్నీ నెరవేరుస్తుంది.

మీన రాశి వారు పసుపును,పసుపు రంగు దుస్తులను దానం చేయాలి. ఇది పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది.



		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *