Vishal: నా శరీరానికి 119 కుట్లు పడ్డాయి.. టాప్ సీక్రెట్స్ బయటపెట్టిన హీరో విశాల్

సినిమా అన్నాక రిస్కీ షాట్స్ చాలానే ఉంటాయి. అయితే వాటిని హీరోలకు బదులుగా డుప్స్ పెట్టి చేయిస్తుంటారు మేకర్స్. కానీ, స్టార్ హీరో విశాల్ విషయంలో అలా జరగదట. ఈ విషయాన్ని విశాల్ స్వయంగా చెబుతూ టాప్ సీక్రెట్స్ రివీల్ చేశారు. తన శరీరానికి ఇప్పటి వరకు 119 కుట్లు పడ్డాయని చెబుతూ తన సినిమాల షూటింగ్ సంగతులు పంచుకున్నాడు. సినిమాల్లో అలాంటి స్టంట్స్ అయినా డూప్‌తో పనిలేకుండా తానే స్వయంగా చేస్తానని విశాల్ చెప్పారు. అయితే ఆయా యాక్షన్ సీక్వెన్స్‌ల్లో గాయాల కారణంగా అన్ని కుట్లు పడినట్టు తెలిపారు.
నిజానికి విశాల్ కోలీవుడ్ యాక్షన్ హీరోనే అయినా.. తెలుగు వారికి కూడా సుపరిచితుడు. పందెంకోడి సినిమాతో చాలామందికి దగ్గరయ్యాడు. మరో విశేషం ఏంటంటే.. ఈ హీరో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లి చేసుకోనున్నాడు. రీసెంట్ గానే చెన్నైలో ఈ జంట ఎంగేజ్మెంట్ వేడుక అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

