వామ్మో.. విశాఖలో ఎగిరే పాము మీరెప్పుడైనా చూశారా?

పాములంటేనే సాధారణంగా పాకుతాయి. సరీసృపాలు జాతి చెందిన పాములు అన్ని నేల మీద పాకుతూనే ఉంటాయి. కానీ ఎగిరే పాము అని ఒకటి ఉందని మీకు తెలుసా. అది క్షణాల్లో అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు దూకుతుందని మీకు తెలుసాశ.? దాదాపు 100 మీటర్లు నుంచి 200 మీటర్లు దూరం ఎగిరి దూకుతుందని మీకు ఐడియా ఉందా. విశాఖలో ఎక్కడా కనిపించని ఓ అరుదైన పాము నావెల్ ఏరియాలో ప్రత్యక్షమైంది. ఇలా కనిపించి అలా మాయం అయిపోయింది. అది ఎగిరే జాతికి చెందిన పామని, ఎగిరే పాము అని పిలుస్తారని, ఫ్లయింగ్ స్నేక్ అని అంటారని స్నేక్ కేచర్ నాగరాజు చెప్పాడు. విశాఖలోని నావెల్ ఏరియాలో ఇది కనిపించింది. అక్కడి అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ నుంచి మరో అపార్ట్మెంట్ బిల్డింగ్ మీద ఎగిరి ఇలా విడియో దొరికిందని, ఇలా కనిపించి అలా మాయం అయిందని నాగరాజు తెలిపారు.

