అక్కడ విలన్.. ఇక్కడ హీరో!.. సుహాస్ మేకోవర్ చూశారా?


సుహాస్ ప్రస్తుతం మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. ఇక తమిళంలో ఇన్నేళ్లు కమెడియన్‌గా ఉన్న సూరి ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు. అలాంటి ఈ సూరి, సుహాస్ కలిసి మండాడి అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. ‘సెల్ఫీ’తో సత్తా చాటుకున్న దర్శకుడు మతిమారన్ పుగళేంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో సుహాస్ తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఈ మూవీని తమిళ, తెలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారట. అయితే తమిళ వర్షెన్కు సూరి హీరోగా, సుహాస్ విలన్‌గా ఉంటాడట. తెలుగు వర్షెన్కు మాత్రం సుహాస్ హీరోగా, సూరి విలన్‌గా ఉంటాడట. అలా ప్రతీ సీన్ రెండు భాషల్లో, రెండు వర్షెన్స్లో తీస్తారన్నమాట. అయితే హీరోయిన్గా మాత్రం మహిమా నంబియార్ కనిపించనుందట.

News By : V.L
