Vastu Tips: శివుడికి ఇష్టమైన మారేడు మొక్కని ఇంట్లో ఈ దిశలో నాటండి.. ఐశ్వర్యానికి లోటు ఉండదు..

ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా వాస్తు నియమాలున్నాయి. ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలను ఏ దిశలో పెంచుకోవాలి? ఏ రోజున నాటాలి వంటి అనేక విషయాలను తెలుయజేస్తుంది. కార్తీక మాసం వచ్చేస్తుంది.. ఈ నెలలో శివుడికి ఇష్టమైన బిల్వ దళాలతో పూజ చేయాలనీ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఇంట్లో మారేడు మొక్కను పెంచుకోవచ్చా.. ఏ దిశలో పెంచుకోవాలి? ఏ రోజున నాటాలి అనే విషయాలను తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రంలో మారేడు మొక్క (బిల్వ మొక్క) చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శివుడికి ప్రీతికరమైన ఈ మొక్కని ఇంట్లో నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు, లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజు ఈ మొక్కకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా మారేడు మొక్కను ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిదట. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మి అనుగ్రహం లభిస్తుందని.. ఐశ్వర్యానికి లోటు ఉందని .. శుభ ఫలితాలను ఇస్తుంది నమ్మకం.
మారేడు మొక్కను వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర లేదా ఈశాన్య దిశలో పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్కని ఒకొక్క దిక్కులో పెంచితే ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది. తూర్పు దిక్కున పెంచితే సమస్త సౌఖ్యాలు, ఉత్తర దిక్కులో పెంచితే అఖండ ధనలాభం, ఈశాన్యం దిశలో పెంచితే లక్ష్మి అనుగ్రహం తో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే మొక్కని పెంచడానికి సూర్యరశ్మి , వెంటిలేషన్‌కు ప్రాధాన్యత తప్పని సరి.
మారేడు మొక్క ఇంటికి శ్రేయస్సుని తీసుకుని రావడానికి, సానుకూలతను ఆకర్షించడానికి సోమవారం, ప్రదోషం లేదా మహా శివరాత్రి లేదా శివునికి సంబంధించిన ఏదైనా శుభ దినాన ఇంటి ఆవరణలో నాటండి. ఇలా చేస్తే ఆ ఇంట్లో పేదరికం తొలగి.. సంపదకు లోటు ఉండదని నమ్మకం.
అయితే మారేడు మొక్కని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెంచుకోకూడదు. అంతేకాదు సోమవారం, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథులలో ఈ మొక్కని నాటవద్దు.

