భార్యకు వెరైటీ విషెస్.. బ్రహ్మాజీ పోస్ట్ వైరల్

నటుడు బ్రహ్మాజీ తాజాగా తన భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. తమ పెళ్లి రోజు అంటూ బ్రహ్మాజీ వేసిన పోస్ట్ అందరినీ నవ్విస్తోంది. భార్య మీద ప్రేమను ఎంత సెటైరికల్‌గా చెప్పుకొచ్చాడు. బ్రహ్మాజీ వేసిన ఈ పోస్ట్, వదిలిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెరుగన్నంకి ఆవకాయలా.. నా జీవితానికి నవ్వులా అంటూ ఇలా కవిత్వాన్ని రాసేశాడు బ్రహ్మాజీ. ప్రస్తుతం బ్రహ్మాజీ పోస్ట్‌కు నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
తన భార్యతో ప్రపంచ దేశాలు తిరగడం తనకు ఇష్టమని బ్రహ్మాజీ చెబుతుంటాడు. తాను సంపాదించిన డబ్బు అంతా కూడబెట్టడం గానీ, ఇన్వెస్ట్ చేయడం వంటిది గానీ ఉండదట. వచ్చిన డబ్బుతో అలా ప్రపంచ దేశాలు చుట్టి వస్తారట. అలా తన భార్యతో కలిసి అన్ని దేశాలు తిరిగి రావడమే తనకు ఇష్టమని బ్రహ్మాజీ చెబుతుంటాడు. ఇలా ట్రావెలింగ్‌కే తన డబ్బు అంతా ఖర్చు అవుతుందని, అందుకే ఎక్కువ ఆస్తులు కూడా కూడబెట్టుకోలేదని బ్రహ్మాజీ అంటుంటాడు.
బ్రహ్మాజీ తాజాగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ అంటూ స్పెషల్‌గా విషెస్ అందించాడు. పెరుగన్నంలోకి ఆవకాయ్ లా.. పాలకు డెవిడోఫ్ కాఫీలా.. వోడ్కాకి జింజిర్ ఆలేలా.. నా జీవితానికి నవ్వుల్లా.. నన్ను భరిస్తున్నందుకు థాంక్స్.. హ్యాపీ యానివర్సరీ సస్వతి అంటూ బ్రహ్మాజీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
News by : V.L
Variety of wishes for wife.. Brahmaji's post goes viral
