Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. ఈ 7 వ్యాధులు పక్కా.. నిర్లక్ష్యం చేస్తే ఊహించని నష్టం!

యూరిక్ యాసిడ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా 7 రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అవేంటంటే..ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువమందిని వేధిస్తోంది. మనం తినే ప్రోటీన్ ఫుడ్‌లో ప్యూరిన్ (Purine) అనే పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తే యూరిక్ యాసిడ్ (Uric Acid) అనే కాంపౌండ్ రిలీజ్ అవుతుంది. ఇది రక్తంలో కలిసిపోయి ఉండటంతో మూత్రపిండాలు వీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి.అయితే, యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, కిడ్నీలు సరిగా పనిచేయకపోయినా ఇది శరీరంలో పేరుకుపోయి, బాడీపై ఎఫెక్ట్ పడుతుంది. యూరిక్ యాసిడ్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా 7 రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అవేంటంటే..కిడ్నీ స్టోన్స్
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతే మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం ఉంది. కిడ్నీలో స్పటికాలుగా ఏర్పడి రాళ్ల ఏర్పాటుకు దారితీస్తుంది. నడుము కింది భాగంలో లేదా పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కలగడం, వికారంతో పాటు మూత్ర విసర్జన తెగ ఇబ్బంది పెట్టడం కిడ్నీ స్టోన్స్ లక్షణాలు. అయితే, చాలా సందర్భాల్లో ఈ కిడ్నీ స్టోన్స్ చిన్న సైజులో ఉండి మూత్రంలో పడిపోతుంటాయి. కానీ, సైజు పెరిగితే బ్లాడర్‌లో చిక్కుకుని మూత్ర విసర్జనకు ఆటంకంతో పాటు తీవ్ర నొప్పిని కలగజేస్తాయి. సరైన సమయంలో ఈ సమస్యకు చికిత్స చేయకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా శాశ్వతంగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎముకలు, కీళ్ల బలహీనత
యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల దీర్ఘకాలంలో ఎముకలు, కీళ్లు బలహీనంగా మారతాయి. కీళ్లలో, ఎముకల చుట్టూ ఉండే కణజాలంలో యూరిక్ యాసిడ్ క్రమంగా స్పటికాలను ఏర్పరచి ఎముకలు, కీళ్లలోని గుజ్జుని నెమ్మదిగా నశింపజేస్తాయి. కొన్నిసార్లు నడవడం కూడా కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు నొప్పి వెంటనే అనుభూతి చెందకపోయినా కీళ్లు గట్టిగా మారడం, వాపు లేదా వైకల్యం సంభవించి గౌట్ (Gout) వంటి వ్యాధులకు దారితీస్తుంది. హైపర్‌టెన్షన్
బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే బ్లడ్ ప్రెజర్ ఎక్కువై హైపర్‌టెన్షన్ కలుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తనాళాలు రిలాక్స్‌గా ఉండేందుకు తోడ్పడే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఇరుకుగా మార్చి గట్టిపరుస్తాయి. దీంతో, రక్తప్రవాహం కష్టమైతుంది. మొదట్లో ఈ సమస్య తక్కువగానే ఉన్నా క్రమంగా ఎలాంటి హెచ్చరిక సంకేతాలు లేకుండా హైపర్‌టెన్షన్‌గా మారుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్
మెటబాలిక్ సిండ్రోమ్కి కీలక కారకమైన ఇన్సులిన్ నిరోధకతను యూరిక్ యాసిడ్ ప్రేరేపిస్తుందని రీసెంట్ పరిశోధనలు చెబుతున్నాయి. బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్లను కలగజేసే మెటబాలిక్ సిండ్రోమ్కి దారితీస్తుంది. శరీరంలో జీర్ణక్రియకు అంతరాయం కలిగించి ఊబకాయం, డయాబెటిస్ వంటివి కలగజేస్తుంది.

