Uric Acid Control Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో.. ఈ డ్రింక్ తాగితే యారిక్ యాసిడ్ మటుమాయం!

యూరిక్ యాసిడ్ సమస్యను పసుపు నీళ్లు తాగడం ద్వారా నియంత్రించవచ్చు. పసుపులోని ఔషధ గుణాలు యాసిడ్‌ను శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇటీవలి కాలంలో చాలా మందిలో యూరిక్ యాసిడ్ సమస్య తరచుగా కనిపిస్తోంది. ఇది వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చాలామందిని ఈ సమస్య పీడిస్తోంది. కానీ వంటింట్లో దొరికే ఈ మసాలాతో ఈజీగా యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టొచ్చు. మన శరీరం నిత్యం జరుగుతున్న జీవక్రియలలో భాగంగా, కొన్ని కణజాలాలు పూరిన్ (Purine) అనే పదార్థాన్ని విడదీస్తాయి. ఈ ప్యూరిన్లను మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా కలిగి ఉంటాయి. ఈ ప్యూరిన్లు శరీరంలో విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్‌గా మారతాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ యాసిడ్ ఎక్కువ భాగం మూత్రం ద్వారా బయటకు వెళుతుంది.

కానీ కొన్ని సందర్భాల్లో శరీరం అవసరమైనంతమేర ఈ యాసిడ్‌ను బయటకు పంపలేకపోతుంది. ఫలితంగా ఇది రక్తంలో పేరుకుపోతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి అధికంగా ఉన్నప్పుడు, ఇది స్పటికాల (crystals) రూపంలో కీళ్లలో, కీళ్ల చుట్టూ పేరుకుపోతుంది.
దీని వల్ల గౌట్ (gout) అనే రకమైన ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా మోకాళ్లు, పాదాలు, కాలివేళ్లు వంటి భాగాల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇంకా దీర్ఘకాలంగా నియంత్రించకుండా ఉంటే, కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశమూ ఉంటుంది.
మన ఆరోగ్యం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్ర పరిమాణం వంటి విషయాలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. సరైన సమతుల్యత లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ స్థాయి నియంత్రణలో ఉండకపోతే శరీరానికి హాని కలగొచ్చు.

ప్రముఖ ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఒక సాధారణ వంటగదిలోని మసాల పదార్థం అయిన పసుపు ఈ సమస్యపై అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో శక్తివంతమైన ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇది యూరిక్ యాసిడ్‌ను శరీరం నుంచి బయటకు పంపించడంలో సహాయపడుతుంది. పసుపు నీళ్లు తాగడం వల్ల కీళ్ల నొప్పి, మోకాళ్ల నొప్పి వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు నీళ్లు తయారుచేయడం చాలా సులభం. ఒక గ్లాసు తేలికపాటి గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, యూరిక్ యాసిడ్ స్థాయిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
అంతేకాకుండా, ఇది ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగించగలదు. ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుందనే చెప్పవచ్చు.

