TVS Apache RTX 300 Vs Himalayan 450: టీవీఎస్ అపాచి RTX 300 Vs రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450.. వీటిలో ఏది బెస్ట్ బైక్?

TVS Apache RTX 300 vs Himalayan 450: ఈ రెండు వెహికల్స్ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధరలు, రెండింటి మధ్య తేడాలు చూద్దాం.దీపావళికి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? కొంచెం ఎక్కువ బడ్జెట్ అయినా ఫర్వాలేదు, మంచి స్పోర్టీ బైక్ కొనాలనుకుంటే.. మీకు మార్కెట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అవే టీవీఎస్ అపాచి RTX 300 (TVS Apache RTX 300), రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450). అపాచి RTX 300 అనేది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన అడ్వెంచర్ టూరర్ బైక్. హిమాలయన్ 450 ఇప్పటికే మార్కెట్‌లో ఒక సెగ్మెంట్‌లో పాపులర్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు వెహికల్స్ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధరలు, రెండింటి మధ్య తేడాలు చూద్దాం.
TVS అపాచీ ఆర్టీఎక్స్ 300 ఫీచర్లుTVS Apache RTX 300 బైక్ 2025 అక్టోబర్ 15న లాంచ్ అయింది. టీవీఎస్ నుంచి వచ్చిన మొట్టమొదటి అడ్వెంచర్ టూరర్ బైక్ ఇది. దీంట్లో 299.1 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ DOHC ఇంజిన్ ఉంటుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ దీని సొంతం. ఇది సుమారు 36 PS పవర్, 28.5 Nm టార్క్ అందిస్తుంది. ఇందులో అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ వంటి నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ABS, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి స్పెసిఫికేషన్స్ దీని సొంతం. ఈ బైక్ అన్ని వేరియంట్లలో క్రూయిజ్ కంట్రోల్ స్టాండర్డ్‌గా ఉంటుంది. టెక్నాలజీ పరంగా.. ఆర్టీఎక్స్ 300లో 5-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది TVS SmartXonnect సిస్టమ్ ద్వారా మొబైల్ కనెక్టివిటీ, ఇతర అప్‌డేట్స్ డిస్‌ప్లే చేస్తుంది. సస్పెన్షన్ కోసం ముందువైపు USD ఫోర్క్, వెనుక వైపు మోనో-షాక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. డ్యుయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లతో ఇది రైడర్లను అట్రాక్ట్ చేస్తోంది. దీని ధర రూ.1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఫీచర్లుRoyal Enfield Himalayan 450 బైక్ 2023 నవంబర్ 24న లాంచ్ అయింది. ఇది పాత హిమాలయన్ మోడల్ కంటే అడ్వాన్స్‌డ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఈ బైక్‌లో కొత్త 452 సీసీ లిక్విడ్-కూల్డ్ ‘షెర్పా’ ఇంజిన్ ఉంటుంది. ఈ మోటార్ 40.02 PS పవర్, 40 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో దూసుకెళ్తుంది. ఈ బైక్‌లో ముందువైపు 43 mm USD ఫోర్క్‌లు, వెనుకవైపు మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్‌తో ఇది మంచి ఆఫ్-రోడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యుయల్-ఛానల్ ABS ఫీచర్, రైడర్ రియర్ ABSను ఆఫ్ చేసుకునే ఆప్షన్.. లాంటి ఫీచర్లు ఉన్నాయి. TFT డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్, స్విచ్‌బుల్ ABS వంటి ఫీచర్లతో ఇది సేల్స్‌లో దూసుకెళ్తోంది. దీని ధర రూ.3.06 లక్షల నుంచి రూ.3.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.ఏది బెస్ట్?TVS Apache RTX 300, Royal Enfield Himalayan 450 రెండూ అడ్వెంచర్ సెగ్మెంట్‌లో వచ్చిన బైక్స్, కానీ వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. అపాచీ RTX 300 అర్బన్ రైడర్స్, వీకెండ్ టూరర్స్‌కు సెట్ అవుతుంది. తక్కువ బడ్జెట్‌లో టెక్ ఫీచర్లు, కంఫర్ట్ కోరుకునే వారు దీన్ని కొనడం బెస్ట్. ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగే వారు, హార్డ్ కోర్ ఆఫ్ రోడర్స్, లాంగ్ డిస్టెన్స్ రైడర్స్, ప్రీమియం అడ్వాన్స్‌డ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారు Himalayan 450 కొనడం మంచిది.

