కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ తరుణంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 81,777 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,209 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.70 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

