మానవతా ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లు పంపిణి

తెనాలి రాష్ట్రవార్త : మానవతా సంస్ధ తెనాలి శాఖ ఆధ్వర్యంలో సంస్ధ అధ్యక్షలు కొలసాని రాంచంద్ నేతృత్వంలో బాపట్ల జిల్లా పెరవలి గ్రామానికి చెందిన పెరవలి వినయ్ కుమార్, వేమూరు కు చెందిన పిల్లి శరత్ లకు ట్రై సైకిల్స్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా రాంచంద్ మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి సహాయ సహకారాలు అందించటానికి మానవతా సంస్ధ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
సంస్ధ రీజినల్ చైర్మన్ కుమార్ పుంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సూచనల మేరకు సహాయం చేసే ముందు సరైన ఎంపిక చేసేందుకు ఒక కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.
అన్ని కార్యక్రమాలలో సహకరిస్తున్న మానవతా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్ధ అధ్యక్షులు ఓంకార్ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు కే. కళ్యాణి, సెక్రటరీ పీ. వెంకట్, వైస్ ప్రెసిడెంట్ పీ. వాసు, ట్రెజరర్ యస్ వి. శర్మ, చిట్టినేని సాంబశివ రావు, పరచూరి మల్లికార్జున రావు, మల్లాది అర్జున్, కావూరి నాగేశ్వర రావు, సి హెచ్. శ్రీనివాసరా రావు, పి, శ్రీనివాస్, పి శివరాజకుమారి, కే. రవీంద్రనాథ్, కే. మదన్ మోహన్ రావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

