Today Horoscope: జూలై 5 రాశి ఫలాలు.. ఈ రాశులవాళ్ళకి ఈరోజు తిరుగులేదు గురూ!.. మీరున్నారా మరి?

Rasi Phalalu 5-07-2025: పన్నెండు రాశుల్లో ఇవాళ (5 జూన్ 2025 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. Rasi Phalalu 5-07-2025: పన్నెండు రాశుల్లో ఇవాళ (5 జూన్ 2025 శనివారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం.మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఉన్నత పదవి లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి రాబడికి, యాక్టివిటీకి లోటుండదు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తుల్లో ఉన్నవారు బిజీ అవడం, రాబడి పెరగడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు ధన యోగాలు పట్టడానికి అవకాశముంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయ త్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఆదా యం చాలావరకు నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రుల వల్ల ఆర్థిక నష్టం జరుగు తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అత్యధిక లాభాలు చవి చూస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట తప్పవు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సాఫీగా సాగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల్లోంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలతో పాటు, కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఊహించని శుభవార్తలు వింటారు. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయం పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. జీతభత్యాలు ఎక్కువగా ఇచ్చే సంస్థలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారం ఒకటి సానుకూలపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి, ఆశించిన పురోగతికి అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన స్థాయి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపో తుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ, ఆర్థిక ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మిత్రుల సాయంతో ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ జీవితం అన్ని విధాలుగానూ పురోగతి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

