Tips and Tricks: రాత్రి లైట్లు వేయగానే పురుగులు, కీటకాలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయా.. ఈ చిన్న చిట్కాతో మళ్లీ కనిపించవు..!

వర్షాకాలం, వింటర్ సీజన్‌లో ఇంట్లో కీటకాల బెడదకు కర్పూరం సహజ పరిష్కారం. కర్పూరం వాసన పురుగులను దూరం చేసి ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచుతుంది.వర్షాకాలం, వింటర్ సీజన్ రాగానే ఇంటి చుట్టూ కీటకాల బెడద పెరిగిపోతుంది. సాయంత్రం అవ్వగానే తలుపులు, కిటికీలు మూసుకున్నా.. అవి ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. లైట్ వెలుగులో చిన్న చిన్న చిమ్మటలు, పురుగులు గుమికూడి తిరుగుతాయి. లైట్లు ఆన్ చేసిన క్షణంలోనే వాటి ఎంట్రీ మొదలవుతుంది. బల్బుల చుట్టూ తిరిగే ఈ పురుగులు కేవలం ఇబ్బందే కాదు, ఆహారంలో పడిపోతూ.. ఇంటిని అసౌకర్యంగా మారుస్తాయి.వీటిని తరిమికొట్టేందుకు స్ప్రేలు, కెమికల్ మందులు వాడినా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని చాలామంది అనుభవం చెబుతోంది. అంతేకాదు, ఆ రసాయనాల వాసన వల్ల ఇంట్లో పిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులు కూడా ఇబ్బందులు పడవచ్చు. ఇలాంటి సమయంలో సురక్షితమైన ఇంటి చిట్కాలు పాటిస్తే.. అద్భుత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు నిపుణులు. వాటిలో కర్పూరం చాలా ప్రధానమైనది.కర్పూరం వాడకం చాలా కాలంగా మన సంస్కృతిలో భాగం. పూజల్లో దీన్ని వాడటం మాత్రమే కాదు, దీనికి సహజమైన క్రిమిసంహారక లక్షణాలున్నాయి. కర్పూరం వాసనను పురుగులు, కీటకాలు అస్సలు తట్టుకోలేవు. అందుకే దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఇంట్లో పురుగుల బెడదకు గుడ్‌బై చెప్పొచ్చు.కర్పూరాన్ని ఉపయోగించే విధానం కూడా చాలా సింపుల్. ముందుగా కర్పూరాన్ని పొడిచేసి తీసుకోవాలి. ఆ పొడిని నీటిలో కరిగించి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఆ మిశ్రమాన్ని కీటకాలు ఎక్కువగా కనిపించే మూలలు, లైట్ల చుట్టూ, వంటగది క్యాబినెట్ల దగ్గర పిచికారీ చేస్తే చాలు. కర్పూరం వాసన తగిలిన వెంటనే కీటకాలు దూరం అవుతాయి. అంతేకాదు, ఆ వాసన ఇంటి వాతావరణాన్ని సువాసనతో నింపేస్తుంది. ఇంట్లో సరికొత్త ఫ్రెష్‌నెస్ ఏర్పడుతుంది.ఇది మాత్రమే కాదు, కర్పూరం ముక్కలను నేరుగా అల్మారాలు, క్యాబినెట్లు లేదా పురుగులు వచ్చే మూలల్లో ఉంచినా చాలా మంచి ఫలితం వస్తుంది. ఒకవైపు కీటకాలను తరిమికొడుతూనే, మరోవైపు ఇంట్లో శుభ్రమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. కెమికల్ స్ప్రేలతో పోలిస్తే ఇది సేఫ్‌గానూ, చవకగా కూడా ఉంటుంది.అయితే, కర్పూరం వాడేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తప్పనిసరి. పిల్లలు, పెంపుడు జంతువులు ఎక్కువగా ఆ వాసన పీల్చకుండా చూసుకోవాలి. అలాగే కర్పూరపు మిశ్రమం ఆహారం లేదా పానీయాల దగ్గర పడకూడదు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, కర్పూరం నిజంగానే సహజమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది

