Thyroid Problems | థైరాయిడ్ ఎందుకు వస్తుంది?

థైరాయిడ్ అనేది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి.ఇది మెడ ముందు భాగంలో ఉంటుంది.ఇది శారీర జీవన క్రియను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరంలోని ప్రతి అవయవం పని తీరుకు అవసరం.థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ లో ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయని వరంగల్ నగరానికి చెందిన సీనియర్ ఫిజీషియన్,ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ అజిత్ మహమ్మద్ వెల్లడించారు. హైపోథైరాయిడిజం,హైపర్ థైరాయిడిజం ఈ రెండు రకాలుగా ఉంటాయి.

