Thyroid Cancer: మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే.. థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లే.. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం

మెడ నొప్పి, గొంతులో అసౌకర్యంగా ఉండడాన్ని చాలా మంది పెద్ద సమస్య అనుకోరు. కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే అవి థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid cancer) లక్షణాలు అయి ఉండొచ్చు.
ఈ క్యాన్సర్‌పై చాలా మందికి పెద్దగా అవగాహన లేదు. ఇది మెడ ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిలో డెవలప్ అవుతుంది. దీనిపై పూర్తి అవగాహన ఉంటే ఇన్‌టైమ్‌లో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.థైరాయిడ్ గ్రంథి ఫంక్షన్స్
మెడ మధ్యలో, స్వరపేటిక కింద సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది బాడీ టెంపరేచర్, హార్ట్ బీట్ రేటు, జీవక్రియలను కంట్రోల్ చేసే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీంట్లో కణాలు అసాధారణంగా పెరిగితే అది క్యాన్సర్‌కు దారితీస్తుంది. అలాంటప్పుడు మన బాడీ వివిధ రూపాల్లో సంకేతాలను అందిస్తుంది. వాటిని ముందుస్తుగా గుర్తిస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది.
వీరికి ముప్పు ఎక్కువ
థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid cancer) ఎవ్వరికైనా వచ్చే ప్రమాదం ఉంది. అయితే, మగవాళ్లతో పోలిస్తే మహిళలకు వచ్చే ఛాన్స్ మూడు రెట్లు ఎక్కువ అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా 40-50 ఏళ్ల మహిళలు, 60-70 ఏళ్ల పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కోసారి చిన్నపిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కుటుంబంలో థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉంటే, అలర్ట్‌గా ఉండాలి. జెనిటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ క్యాన్సర్‌కు కారణం అవుతుంటాయి.

లక్షణాలు
తినేటప్పుడు ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి థైరాయిడ్ క్యాన్సర్ (Thyroid cancer) లక్షణాలు. మెడలోని లింఫ్ నోడ్స్లో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగేటప్పుడు గొంతులో నొప్పి, గొంతు బొంగురుపోవడం, వాయిస్‌లో మార్పు, అలసట, ఆకలి వేయకపోవడం, వికారం, వాంతులు, ఒక్కసారిగా బరువు తగ్గడం వంటివన్నీ థైరాయిడ్ క్యాన్సర్ సంకేతాలు. వీటిలో ఏవి కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఈ క్యాన్సర్‌కు కారణాలు
శరీరంలో అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ గ్రంథి ఊహించని రీతిలో పెద్దగా పెరగడం, గతంలో ఫ్యామిలీలో ఎవరికైనా ఈ క్యాన్సర్ వచ్చి ఉండడం, ఇతర క్యాన్సర్ల కోసం గతంలో రేడియేషన్ థెరపీ తీసుకున్న వారికి రిస్క్ ఎక్కువ. థైరాయిడ్ గ్రంథిలో మంట రావడం (థైరాయిడిటిస్), అధిక బరువు కూడా థైరాయిడ్ క్యాన్సర్‌కు కారకాలు.
ట్రీట్మెంట్
సర్జరీ: క్యాన్సర్ సోకిన కణాలను సర్జరీ చేసి తొలగిస్తారు. ఇది అన్ని క్యాన్సర్లలో చేసే సాధారణ ట్రీట్మెంట్.
రేడియేషన్ థెరపీ: పవర్ఫుల్ రేడియేషన్‌తో క్యాన్సర్ కణాలను చంపుతారు.

