Thyroid and Pregnancy : ప్రెగ్నెంట్స్‌కి ఉన్న థైరాయిడ్ పుట్టే బిడ్డపై ఎఫెక్ట్ చూపొద్దొంటే ఇలా చేయాలి..

Thyroid and Pregnancy : థైరాయిడ్.. ఈ సమస్య కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో థైరాయిడ్ వస్తే పుట్టబోయే బిడ్డపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్ చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో థైరాయిడ్ ఉంటే అది పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపుతుంది.అందుకే దీనిని కంట్రోల్ చేసుకునేందుకు కచ్చితంగా డాక్టర్ని కలిసి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి.థైరాయిడ్ అనేది హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం అనే రెండు రకాలు ఉన్నాయి. హైపోథైరాయిడిజంలో.. థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే తక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది.
హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ గ్రంథి చాలా హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది. బరువు పెరగడం, ముఖం వాపు ఉండడం, మలబద్ధకం, అలసట వంటి లక్షణాలు ఉన్నాయి.
హైపర్ థైరాయిడిజం లక్షణాలు కనిపించినప్పుడు TSH(Thyroid Stimulating Hormone) టెస్ట్ చేస్తారు. TSH స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉంటే మీకు హైపర్ థైరాయిడిజం ఉందని అర్థం.
శరీరంలో హార్మోన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి డాక్టర్స్ యాంటీ థైరాయిడ్ మెడిసిన్‌ని సూచిస్తారు. ఈ మెడిసిన్ పుట్టబోయే బిడ్డకి మంచిదని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్‌కి ముందు, ప్రెగ్నెన్సీ టైమ్‌లో కచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయమని డాక్టర్స్ చెబుతారు.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో సాధారణ థైరాయిడ్ స్థాయిలు 0.4-4mlU/Lగా ఉండాలి.
ఫస్ట్ ట్రైమెస్టర్‌లో, థైరాయిడ్ స్థాయిలు 0.1 నుండి 2.5 mlU/L వరకూ ఉండాలి.
అంటే 0.1mlU/L కంటే తక్కువకాదు, 2.5mlU/L కంటే ఎక్కువ కాదు.
సెకండ్ ట్రైమెస్టర్‌లో థైరాయిడ్ స్థాయిలు 0.2 నుండి 3.0 mlU/L వరకు ఉంటాయి. ఉండాలి.
0.2mlU/L కంటే తక్కువ కాదు, 3.0mlU/L కంటే ఎక్కువ కాదు.
థర్డ్ ట్రైమెస్టర్‌లో థైరాయిడ్ స్థాయిలు.. 0.3mlU/L కంటే తక్కవ ఉండకూడదు. 3.0mlU/L కంటే ఎక్కువ ఉండకూడదు.
ఫస్ట్ ట్రైమెస్టర్ : సాధారణంగా 0.8 మరియు 2.0ng/dL మధ్య ఉంటుంది.
సెకండ్ ట్రైమెస్టర్ : సాధారణ పరిధి ఎక్కువగా ఉండొచ్చు. 0.8 నుండి 1.8ng/dL వరకు ఉంటుంది.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో హైపో థైరాయిడిజం తగ్గించేందుకు వర్కౌట్ చేయాలి.
ఎక్కువగా నడవండి. బ్రీథింగ్ వర్కౌట్స్ చేయాలి. యోగా చేయాలి.
థైరాయిడ్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో మంచి ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినాలి.
కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా థైరాయిడ్ ఉంటే మీరు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

