వంట నూనె కొనే ముందు కచ్చితంగా చెక్ చేయాల్సిన మూడు విషయాలు, ఏమేం చెక్ చేయాలో తెలుసా …

వంట నూనె కొనే ముందు తప్పనిసరిగా మూడు విషయాలు చెక్ చేయాలని హెల్త్ ఎక్స్ పర్ట్ చెబుతున్నారు. వీటిని చెక్ చేసిన తరవాతే కొంటే మంచిదని సూచిస్తున్నారు. అదే సమయంలో నూనె వాడకాన్ని వీలైనంత వరకూ తగ్గించాలని అంటున్నారు. ఏదో షాప్ కి వెళ్లామా ఆయిల్ ప్యాకెట్ కొని తీసుకొచ్చామా అని కాదు. కుకింగ్ ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజూ వాడే పదార్థం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫిట్ గా ఉండాలంటే డైట్ విషయంలో ఈ మాత్రం అప్రమత్తం తప్పదు. అదే సమయంలో ఆ ఫుడ్ ని ఎలా తయారు చేస్తున్నాం. ఎలాంటి పదార్థాలు వాడుతున్నామన్నదీ ముఖ్యమే. అనారోగ్యకరమైన నూనెతో హెల్తీ ఫుడ్ తయారవ్వదు. అందుకే వంట నూనె కొనే ముందే కచ్చితంగా కొన్ని విషయాలు గమనించాలని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్. ప్రతి వంటలోనూ నూనె వాడతారు కాబట్టి వాటి వల్ల ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా చాలా త్వరగా ప్రభావం చూపిస్తుంది. మరి వంట నూనె విషయంలో అసలు ఏయే అంశాలు గమనించాలి. ఇలా గమనించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.నూనె లేకుండా వంట ఉండదు. ఏదో విధంగా ఆయిల్ వాడుతూనే ఉంటారు. అందుకే..ఇక పిండి వంటలు, స్నాక్స్ కోసమైతే ఎక్కువ మొత్తంలో నూనె వాడేస్తుంటారు. మామూలుగా అయితే..రోజు మొత్తంలో ఓ వ్యక్తి మూడు లేదా నాలుగు స్పూన్స్ కన్నా ఎక్కువగా ఆయిల్ వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ..అంత కన్నా ఎక్కువ వాడే వాళ్లే అధికంగా ఉన్నారు. మరి ఈ స్థాయిలో వాడుతున్నప్పుడు అది ఆరోగ్యకరమైనదేనా అనేది గమనిస్తున్నారా. అందరూ వాడుతున్నారు కదా అని అవే వాడేస్తున్నారా. ఈ విషయాన్నే గమనించాలని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్ మహాజన్. ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ కొనే ముందు మూడు విషయాల్ని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
నిజానికి ఆరోగ్యంగా ఉండాలన్న మాట వచ్చిన ప్రతిసారీ అందరూ ప్రొటీన్, షుగర్, కేలరీలు గురించే డిస్కస్ చేస్తారు. హెల్తీగా ఉండడంలో ఈ మూడు చాలా ముఖ్యం. మరీ ఎక్కువైనా కష్టమే. మరీ తక్కువైనా ప్రమాదమే. ఈ బ్యాలెన్స్ ఎప్పుడూ తప్పకూడదు. కానీ..ఈ మూడింటితో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఆయిల్. ఇది కూడా సరైన విధంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశముంటుంది. హెల్త్ ఎక్స్ పర్ట్ మహాజన్ చెప్పిన ప్రకారం చూస్తే..వంట నూనె కొనే ముందు గమనించాల్సిన మొదటి విషయం అది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అవునో కాదో చెక్ చేయడం.
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు మహాజన్. అందుకు కారణాలేంటో కూడా వివరించారు. ఈ ఆయిల్స్ ని హీట్ చేయకుండానే తయారు చేస్తారు. అంతే కాదు. వీటిలో కెమికల్స్ కూడా ఉండవు. అంతే కాదు. వీటిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ ఇ, పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఈ ఆయిల్స్ ని వాడాలని సజెస్ట్ చేస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ సులువుగా బయటకు వచ్చేస్తాయి. పైగా ఈ నూనెతో వంట చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొలెస్ట్రాల్ సమస్య కూడా రాదు.
వంట నూనె కొనే ముందు కచ్చితంగా చెక్ చేయాల్సిన మరో విషయం స్మోక్ పాయింట్. ఆయిల్ ఆరోగ్యకరమైందా కాదా అన్నది దీనిపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మహాజన్. సాధారణంగా మన వంటలన్నీ ఎక్కువ మంటలోనే చేస్తారు. వేపుళ్లు, రకరకాల స్నాక్స్ ఇందుకు ఉదాహరణలు. ఇలాంటివి చేసినప్పుడు దాదాపు 230 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆయిల్ మరుగుతుంది. అయితే..మీరు తీసుకుంటున్న ఆయిల్ ఈ హీట్ ని తట్టుకుంటుందా లేదా అన్నదే ఈ స్మోక్ పాయింట్. ఒకవేళ మీరు కొన్న నూనె ఈ స్మోక్ పాయింట్ ని..అంటే ఆ హీట్ ని తట్టుకోలేకపోతే చాలా త్వరగా విరిగిపోయినట్టుగా అవుతుంది. అందులో రకరకాల రసాయనాలు ఏర్పడతాయి. వీటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది.

