ఈ ఏడాది కుబేరుడు అనుగ్రహం ఈ రాశుల సొంతం.. డబ్బులతో తులతూగుతారు..

దేశ వ్యాప్తంగా దీపావళి పండగ సందడి మొదలైంది. ధన త్రయోదశి నుంచి మొదలయ్యే ఈ పండగ ఐదు రోజుల పాటు జరుపుకోనున్నారు. దీపావళి రోజున సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి, సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది కుబేరుడు కొన్ని రాశుల పట్ల ప్రత్యేకంగా అనుగ్రహాన్ని చూపిస్తాడు. వీరి జీవితంలో ఏడాది పాటు డబ్బుకి కొరతే ఉండదు.
హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. దీపావళి ఐదు రోజుల పండుగ. దీపావళి మొదటి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటారు. చివరి రోజున అన్నా చెల్లెల పండగను జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవి,గణపతిని,కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి, కుబేరుడిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంపద, శ్రేయస్సు వస్తుంది.
జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రరాశులు దీపావళి పండుగ రోజున ప్రత్యేక ప్రభావాన్ని చూపనున్నాయి. జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం కొన్ని రాశులకు కుబేరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. వారికి అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి. దీపావళి రోజున సంపదలకు దేవుడైన కుబేరుడి ఆశీస్సులు ఏ రాశులకు లభిస్తాయో తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశిలో జన్మించిన వారు కుబేరుని ప్రత్యేక అనుగ్రహంతో ఆశీర్వదించబడతారు. అలాంటి వ్యక్తులు అన్ని రకాల భౌతిక సుఖాలు, లాసాలను అనుభవిస్తారు. ఎప్పుడూ డబ్బు కొరత అన్న మాటే ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవం, ప్రతిష్టను పొందుతారు. కుబేరుడు ఈ రాశికి చెందిన వ్యక్తుల పట్ల చాలా దయగలిగి ఉంటాడు.
తులా రాశి: తులా రాశి వారు కుబేర దేవుడి ప్రత్యేక ఆశీర్వాదాలను కూడా పొందుతారు. అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు. కుబేర భగవానుడి ఆశీస్సులతో వీరు సంపదను కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. చిన్న అవకాశాలను కూడా పెద్దవిగా మార్చుకుంటారు. వారు ధైర్యం, శౌర్యంతో నిండి ఉంటారు.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి కుబేరుడు అనుగ్రహం కలిగి ఉంటారు. చాలా తక్కువ సమయంలోనే సంపదను కూడబెట్టుకోగలుగుతారు. నిజాయితీతో వీరు చాలా సంపాదిస్తారు. ధనుస్సు రాశి వారు జీవితంలోని అన్ని సవాళ్లను సులభంగా అధిగమిస్తారు
