శరీరంలో ఈ వ్యవస్థనే మెయిన్.. పని చెయ్యకుంటే ఎన్ని కోట్లున్నా దండగే!

మన శరీరంలో సందేశాలను శరీరానికి అందించడానికి, కండరాల కదలికలను నియంత్రించడానికి, వివిధ సమాచారాలను మెదడుకు చేరవేయడానికి, అవయవాలు విధులను నిర్వర్తించడానికి నరాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అటువంటి నరాల ఆరోగ్యం చాలా కీలకమైనది. శరీరంలో నాడీ వ్యవస్థ పని చేయకుంటే ఎన్ని కోట్ల డబ్బున్నా వేస్ట్అని చెప్పటం తప్పేం కాదు.
నరాల పాత్ర శరీరంలో చాలా ముఖ్యం మెదడు నుండి మొదలయ్యే కపాల నరాలు, వెన్నుపాము నుండి ప్రారంభమయ్యే వెన్నుపాము నరాలు శరీరంలోని వివిధ భాగాలకు సమాచారాన్ని చేరవేస్తాయి. ఫ్రెనిక్ నరాలు శ్వాసక్రియలో కీలక భూమిక పోషిస్తాయి. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం అనేది ప్రతీది నాడీ వ్యవస్థ చేతిలోనే ఉంటుంది.
నరాల ఆరోగ్యానికి ఇవి తప్పనిసరిగా ఉండాలి నరాల ఆరోగ్యం పైన ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. నరాల ఆరోగ్యం కోసం మన శరీరానికి విటమిన్ బి12, విటమిన్ బి 6, విటమిన్ బి3, బి1 తోపాటు మొక్కల ఆధారిత ఆహారాలు క్రమబద్ధమైన వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి . బి విటమిన్లు నరాల నష్టాన్ని తగ్గించడంలో, తిమ్మిర్లు, జలదరింపులు వంటి లక్షణాలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. నరాల ఆరోగ్యానికి ఇవి తినాలి నరాల ఆరోగ్యం కోసం విటమిన్ బి అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నడక, సైక్లింగ్ వంటివి తప్పనిసరిగా చేయడం చేయాలి నరాల ఆరోగ్యానికి సరైన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, బెర్రీలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు నరాల నొప్పులు, వాపులు తగ్గించి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

