This is what the fans wanted.. Nagarjuna’s romance with that heroine after 27 years

కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హీరోగానే కాదు నాగార్జున విలన్ అదరగొడుతున్నాడు. ఆ మధ్య బ్రహ్మాస్త్ర సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆతర్వాత కుబేర సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు.. ఆతర్వాత కూలి సినిమాలో విలన్ గా నటించాడు.టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఇప్పుడు రూట్ మార్చారు. ఇన్ని రోజు లు హీరోగా అదరగొట్టిన నాగ్.. ఇప్పుడు విలన్ అవతారమెత్తారు. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు’ నాగ్. నిజం చెప్పాలంటే కూలి సినిమా వల్ల నాగ్ క్రేజ్ మరింత పెరిగింది. సినిమా మొత్తం ఆయనే డామినేట్ చేశారు. తమిళ్ ఆడియన్స్ నాగ్ కు ఫిదా అయ్యారు. అప్పుడెప్పుడో వచ్చిన రాక్షసుడు సినిమాలో ఎలా ఉన్నడో ఇప్పుడూ అలానే ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఇది నాగ్ కెరీర్ లో 100వ సినిమా.. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపనున్నారని తెలుస్తుంది.

ఇదెక్కడి సినిమారా మావ ..! పెట్టింది రూ.5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు

నాగార్జున 100వ సినిమాకు లాటరీ కింగ్  అనే ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే నాగ్ కోసం రంగంలోకి దిగుతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఒకప్పుడు నాగార్జున ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులు ఉప్పొంగిపోయేవారు. ఆమె ఎవరో కాదు అందాల భామ టబు.. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా టబు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మొన్నామధ్య అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించింది. ఇక హిందీలో సినిమాలు చేస్తుంది.స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్

ఇటీవలే ఆమె పూరిజగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే టబు ఇప్పుడు కింగ్ నాగార్జున సినిమాలోనూ నటిస్తుందని తెలుస్తుంది. నాగార్జున టబు కలిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడేలాంటి సినిమాలు చేశారు. అలాగే నాగార్జున నటించిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఈ ఇద్దరి జోడీగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పట్లో రూమర్స్ కూడా చాలా వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నాగ్, టబు కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దాదాపు 27ఏళ్ల తర్వాత టబుతో కలిసి నటించనున్నారు నాగ్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.




		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *