వరస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి , నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మనశంకర వరప్రసాద్’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన ‘మీసాలపిల్ల’ పాట మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుస్మిత కొణిదెల, సాహు గారికపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిలియో స్వరాలు సమకూరుస్తున్నారు.
‘మీసాలపిల్ల’ పాట ప్రోమో విడుదలైనప్పుడే కొద్దిగా ట్రోలింగ్ ఎదుర్కొంది. అయితే, ఫుల్ సాంగ్ విడుదలయ్యాక విమర్శలు మరింత పెరిగాయి. నెటిజన్లు ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారించారు.
చిరంజీవి, నయనతారల మధ్య కెమిస్ట్రీ అస్సలు కుదరలేదని, తెరపై వారి జోడీ పండలేదని ఎక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు.పాటలో మెగాస్టార్ ముఖంలో సరైన హావభావాలు (ఎక్స్‌ప్రెషన్స్) కనిపించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ పాటలకు చిరు ఇక దూరంగా ఉంటే మంచిదని, వయసుకు తగిన పాత్రలు, సినిమాలపై దృష్టి పెట్టాలని అభిమానులు సైతం కోరుతున్నారు.
ఈ ట్రోల్స్‌లో భాగంగా, ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలోని “కాత్యాయని ఫోన్ చేయవే” పాటను చిరంజీవి ‘మీసాలపిల్ల’ పాటకు జోడించి వీడియోలు, మీమ్స్ సృష్టిస్తున్నారు. “ఒరేయ్ అఖిల్ ఇదేమి పాటరా..” అంటూ చిరు పాడినట్టుగా ఆ ఫుటేజ్‌ను ఉపయోగించి ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ప్రతి సినిమా సంక్రాంతి వస్తున్నాం కాలేవంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన ఈ పాట తీవ్ర విమర్శలను ఎదుర్కుంటుంది.
