పెళ్లిపై అల్లు శిరీష్ ఒపీనియన్ ఇదే.. ఇక ఎప్పటికీ సింగిల్‌గానే ఉంటాడా?


అల్లు శిరీష్ సింగిల్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ని యాంకర్ సుమ పెళ్లి ఎప్పుడు అని అడిగేసింది. మా అమ్మానాన్నలకంటే ఎక్కువగా మీరే అడుగుతున్నారు.. ఏమైనా సంబంధాలు చూస్తారా? అని సుమకి శిరీష్ కౌంటర్ వేశాడు. సింగిల్ లైఫ్ బాగుందని, పెళ్లి వద్దని చాలా మంది చెబుతున్నాని శిరీష్ అన్నాడు. అయితే అల్లు అరవింద్ కూాడా శిరీష్‌ను గత పదేళ్ల నుంచి పెళ్లి పెళ్లి అని వెంటపడుతున్నాడట.
పదేళ్ల నుంచి అల్లు అరవింద్ అడుగుతున్నా కూడా శిరీష్ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడం లేదనిపిస్తోంది. పెళ్లి కంటే సింగిల్‌గా ఉంటేనే బాగుంటుందని అల్లు శిరీష్ అంటున్నాడు. మీ ఇంట్లోనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది.. బన్నీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు కదా అని సుమ అంటే.. నేను సింగిల్‌గా కూడా హ్యాపీగానే ఉన్నాను కదా అని అల్లు శిరీష్ రివర్స్ కౌంటర్ వేశాడు.

News by : V.L
This is Allu Sirish's opinion on marriage.. Will he remain single forever?