ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్ ఫుల్లుగా ఉండే కూరగాయ ఇదే… ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది.

బోడ కాకరకాయ వర్షాకాలంలో మాత్రమే లభిస్తుంది. రైతు బజార్‌లో కేజీ 110 రూపాయలు ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి, క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది.కూరగాయలు అన్నిటిలో రిచ్ ప్రోటీన్ కూరగాయ ఆగాకరకాయ. దీనినే బోడ కాకరకాయ అంటారు. ఇది వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది. ప్రస్తుతం రైతు బజార్‌లో ఈ ఆగాకరకాయలు అమ్మకాలు చేస్తున్నారు. వీటి ధర కేజీ 110 రూపాయలు ఉందని ఎంవిపి కాలనీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు అంటున్నారు. వర్షాకాలంలో మాత్రమే లభించే బోడ కాకరకాయను తింటే ఎంతో ఆరోగ్యమని తెలుపుతున్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వేల ఎకరాల్లో బోడ కాకరకాయ సాగు జరుగుతుంది. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ బోడ కాకరకాయ పంట చేతికి వస్తుంది. ఈ సీజన్‌లో బోడ కాకరకాయకి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఈ బోడ కాకరకాయ తింటే ఆరోగ్యం విషయంలో ఎన్నో లాభాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఈ కాకరకాయ రుచితో పాటు పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతాల్లో ఈ బోడ కాకరకాయ ఎక్కువగా పండేది.
