కడుపు మొత్తాన్ని క్లీన్ చేసి చెత్తని బయటికి పంపే గింజలు, రెగ్యులర్‌గా తింటే జీర్ణ, మలబద్ధక సమస్యలు దూరం

రెగ్యులర్‌గా మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉంటే మీ గట్ హెల్త్ బాలేదని అర్థం. ఈ సమస్య కంట్రోల్ అవ్వడానికి ముందుగా సరైన గట్ హెల్త్‌ని సరిచేసుకోవాలి. అంతేకానీ, మార్కెట్లో దొరికే మందుబిల్లలు వేసుకోకూడదు. సమస్య తగ్గేందుకు సరైన ఫుడ్స్ తీసుకోవాలి. అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉంటే వాటిని తగ్గించేందుకు మందులు మాత్రమే వేసుకోకుండా సమస్యని సమూలంగా దూరం చేసేందుకు డైట్‌ని మార్చడం ముఖ్యం. రోజులు గడిచినా మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గకపోతే మీ గట్ హెల్త్ బాలేదని అర్థం. దీని వల్ల మీ రోజువారి పనులు సరిగా చేసుకోలేరు. అలాంటప్పుడు ప్రేగు కదలికలు సరిగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం హెల్దీ డైట్‌ని ఫాలో అవ్వాలి. దీనికోసం గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేథి పేగు ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఫుడ్స్ గురించి షేర్ చేసుకున్నారు. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగ్గా మారి గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.మెగ్నీషియం వంటి ఖనిజాల నుండి పేగులకు అనుకూలమైన ఫైబర్ వరకూ పోషకాలు గట్ హెల్త్‌కి చాలా మంచివి. ఇవి పుష్కలంగా లభించే కొన్ని ఫుడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. అలాంటి ఫుడ్స్ ఏ మెడిసిన్స్ లేకుండానే చక్కగా గట్‌ని కాపాడతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసి ముఖ్యంగా మలబద్దకం సమస్యని తగ్గిస్తాయి.
నల్ల నువ్వులు
నల్ల నువ్వుల్ని చాలా మంది ఎక్కువగా వాడరు. కానీ, మిగతా గింజలతో పోలిస్తే నల్ల నువ్వులు ప్రేగు ఆరోగ్యాన్ని హెల్దీ గా చేస్తుంది. నువ్వుల్లో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల పేగు కదలికలు మెరుగ్గా ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం పేగు కండరాలని సడలించి ఆహార కదలికల్ని మెరుగ్గా చేస్తాయి. రెగ్యులర్‌గా వీటని మీ డైట్‌లో చేర్చుకుంటే చాలా వరకూ జీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీనికోసం మీరు నల్లనువ్వుల్ని బెల్లంతో కలిపి ఉండలా చేసి తినొచ్చు. లేదంటే పొడిలా చేసి అన్నం, టిఫిన్స్‌లో తినొచ్చు. కారంపొడిలో నల్లనువ్వుల పొడి కలిపి అన్నంతో తినొచ్చు. లేదంటే నల్లనువ్వుల్ని నేరుగా సలాడ్స్‌పై చల్లి తినడం, శాండ్‌విచ్, బ్రెడ్‌పై చల్లి కూడా తినొచ్చు.
అవిసెలు
అవిసె గింజలు గట్ హెల్త్‌కి చాలా మంచివి. వీటిని తినడం వల్ల హార్మోన్ కంట్రో ఉంటుంది. వీటిలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవిసెల్లోని లిగ్నాన్స్ హార్మోన్స్ వాటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ని బ్యాలెన్స్ చేయడంలో గట్ వాపుని తగ్గించడంతో పాటు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్‌ని ప్రోత్సహిస్తుంది. వీటిని మనం ఓట్స్‌లో కలిపి తినొచ్చు. సలాడ్స్‌లో వేసుకుని తినొచ్చు. పొడిలా చేసి కూడా తినొచ్చు.

