ఈ వారం థియేటర్, OTTల్లోకి రాబోయే సినిమాలు ఇవే

జియో హాట్ స్టార్ వేదికగా ది రాజా సాబ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6వ తేదీన అంటే శుక్రవారం రోజున నుంచి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది.

సినిమా ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ వారం థియేటర్ తో పాటు ఓటీటీలోకి చాలా సినిమాలే రాబోతున్నాయి. ముందుగా ఓటీటీలోకి వచ్చే సినిమాలు పరిశీలిస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా OTT లోకి రాబోతోంది. జియో హాట్ స్టార్ వేదికగా ది రాజా సాబ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 6వ తేదీన అంటే శుక్రవారం రోజున నుంచి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. థియేటర్ లో మిస్ అయిన వాళ్లు జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. చాలామంది జియో కస్టమర్లకు హాట్ఉచితంగానే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

అటు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా నెల రోజులు తిరగకు ముందే రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈ నారీ నారీ నడుమ మురారి సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పరాశక్తి సినిమా కూడా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. అటు సైక్ సిద్ధార్థ ఫిబ్రవరి 4వ తేదీ అంటే ఎల్లుండి నుంచి ఆహాలో రానుంది. సన్ నెక్స్ట్ లో నీలకంఠ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.

థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

ఫిబ్రవరి మొదటి వారంలో దాదాపు 5 నుంచి 7 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న యుఫోరియా సినిమా కూడా ఈ వారం థియేటర్లో రిలీజ్ కానుంది. సుమతి శతకం, హనీ, ఆపరేషన్ పద్మ, శ్రీ చిదంబరం గారు, విత్ లవ్ లాంటి సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top