మీకు ఉండే ఈ అలవాట్లే దోమలను ఎక్కవగా ఆకర్షిస్తాయట.. తాజా పరిశోధలో నమ్మలేని నిజాలు!

దోమలు ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. కానీ దొమలు కొన్ని సార్లు కొందరిని ఎక్కువగా.. మరికొందరిని తక్కువగా కరుస్తూ ఉంటాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఇక్కడ కొందు పరిశోదకులు దానిపై ఒక ప్రయోజం చేశారు. అందులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అవెంటే తెలుసుకుందాం పదండి.
దోమలు ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. కానీ దొమలు కొన్ని సార్లు కొందరిని ఎక్కువగా.. మరికొందరిని తక్కువగా కరుస్తూ ఉంటాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఇటీవల, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాలు వాళ్లను ఆశ్చర్యానికి గురిచేశాయి. అదేంటంటే మద్యం తాగే వారిని దోమలు ఎక్కువగా కుడుతున్నట్టు ఈ పరిశోధకులు కనుగొన్నారు.
దర్లాండ్స్‌లోని శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యనంలో బీర్, మద్యం తాగేవారిని ఎక్కువగా దోమలు కుడుతున్నట్టు గుర్తించారు. ఈ పరిశోధనను రాడ్‌బౌడ్ విశ్వవిద్యాలయం నిజ్‌మెగెన్‌కు చెందిన శాస్త్రవేత్త ఫెలిక్స్ హోల్ బృందం నిర్వహించింది. ఈ పరిశోధన నుండి వచ్చిన సమాచారం బయోఆర్‌క్సివ్ అనే పరిశోధనా వేదికలో ప్రచురించబడింది. కొందరినే దోమలు ఎందుకు ఎక్కువగా కరుస్తాయని ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ఈ బృందం నెదర్లాండ్స్‌లోని లోలాండ్స్‌లో జరిగిన ఒక పెద్ద సంగీత ఉత్సవంలో వేలాది దోమలతో, 500 మందిపై ఒక ప్రయోగాన్ని నిర్వహించింది.
దీనికోసం, ఈ పరిశోధకులు పార్టీలో ఒక పాప్-అప్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఆపై పార్టీకి వచ్చిన వ్యక్తుల తాగడం, తినడం, పరిశుభ్రత, ప్రవర్తనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత వారిని ఒక ప్రత్యేక పెట్టెలో చేతులు పెట్టమన్నారు. ఆ పెట్టెలో దోమలు ఉన్నాయి. కానీ ఈ పెట్టెలో చిన్న రంధ్రాలు ఉండడం వల్ల దోమలు వాళ్ల చేతులను వాసన చూడగలవు కానీ వారిని కుట్టలేవు. తరువాత, కెమెరాల సహాయంతో, పెట్టెలోని ఎన్ని దోమలు చేతిపై పడ్డాయో, అవి ఎంతసేపు అక్కడే ఉన్నాయో రికార్డ్ చేశారు.
ఈ పరిశోధన చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. బీరు తాగిన వ్యక్తులు నార్మల్ వ్యక్తుల కన్నా .35 రెట్లు ఎక్కువ దోమలను ఆకర్షించినట్టు వారు కనుగొన్నారు. అంతేకాకుండా సన్‌స్క్రీన్ తక్కువగా ఉపయోగించే, క్రమం తప్పకుండా స్నానం చేయని వ్యక్తుల పట్ల కూడా దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. శాస్త్రవేత్తల ప్రకారం, బీరు తాగే వ్యక్తులు తరచుగా భిన్నంగా ప్రవర్తిస్తారని, అంటే ఎక్కువగా నృత్యం చేయడం, ఎక్కువగా చెమట పట్టడం, ఇది వారి శరీర దుర్వాసనను మారుస్తుందని ఫెలిక్స్ హోల్ అన్నారు. ఈ వాసన దోమలను చాలా త్వరగా ఆకర్షిస్తుంది. దోమలు దాదాపు 350 అడుగుల దూరం నుండి మానవుల వాసనను గుర్తించగలవని కూడా వారు కనుగొన్నారు.

