ఉభయ గోదావరి జిల్లాల్లో మడత కాజా.. ఆ టెస్ట్ వేరే లెవెల్

మడత కాజా అనేది ఉభయ గోదావరి జిల్లాలలో ప్రఖ్యాతి పొందిన ఓ సాంప్రదాయ మిఠాయి. ఆకర్షణీయమైన రూపం, తీపి , క్రిస్పీ స్వభావం కలిగిన ఈ స్వీట్ పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాలలో ఎక్కువగా తయారు చేస్తారు.
మడత కాజా అనేది ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రఖ్యాతి కలిగిన ఒక సాంప్రదాయక స్వీట్. దీని పేరు వినగానే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ స్వీట్ కి ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. మడత ఖాజా అనేది రూపంలో ఆకర్షణీయంగా, రుచిలో ప్రత్యేకంగా ఉండే ఆంధ్రా ప్రత్యేకమైన స్వీట్. ఇది భారతీయ సంప్రదాయ వంటకాలలో ఒక విలక్షణమైన ముద్ర వేసిన చక్కని మిఠాయి. మడత అంటే మడత పెట్టడం లేదా రోలింగ్ లేయర్లుగా చుట్టడం. “కాజా” అంటే తీపి, సిరప్‌లో ముంచిన స్వీట్. ఈ స్వీట్‌ను మైదాను పలుచగా చేసి, లేయర్లుగా చుట్టి, తర్వాత దాన్ని వేయించి, పాకంలో నానబెట్టి తయారు చేస్తారు. బయట భాగం బంగారు రంగులో తేలికగా, క్రిస్పీగా ఉంటుంది. ఇవి ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో తయారు చేస్తుంటారు.
ఈ మడత కాజాలో లోపలి భాగం తీపిగా, పాకం చొచ్చుకుపోయి తేమగా ఉంటుంది. తినగానే నోట్లో కరకరలాడుతూ తీపి తడితో జారుతుంది. దీని తయారీ శైలి చాలా అందంగా, కళాత్మకంగా ఉంటుంది. చుట్టిన మడతల మధ్య తీపి పాకం తేలికగా చేరి మృదువైన అభిరుచిని ఇస్తుంది. మడత ఖాజా అనేది ఆంధ్రాలో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు, ఊరేగింపులు వంటి వేడుకల్లో తయారు చేస్తారు. ఎలాంటి రిఫ్రిజరేషన్ లేకుండానే 5–7 రోజులు నిల్వ ఉంటుంది. సరిగ్గా బంధించిన డబ్బాలో ఉంచితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అని చెబుతున్నారు.

ADVERTISEMENT
