ఇంట్లో జమ్మి చెట్టుని పెంచడానికి వాస్తు నియమాలున్నాయి.. ఏ రోజున ఏ దిశలో పెంచాలంటే..

జమ్మి మొక్కను పురాణ శాస్త్రాలలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ మతంలో ఈ మొక్క శనిదేవుడితో సంబంధం కలిగి ఉందని చెబుతారు. అందువల్ల ఎవరైనా ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకుంటే అది దురదృష్టాన్ని దూరం చేసి.. అదృష్టాన్ని తెస్తుంది. అయితే జమ్మి మొక్క నాటే సమయంలో వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కనుక ఇంట్లో శమీ మొక్కను నాటడానికి వాస్తు నియమాలు గురించి తెలుసుకుందాం..
హిందూ మతంలో జమ్మి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్క శని గ్రహం ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. అందువల్ల చాలా మంది తమ ఇళ్లలో జమ్మి మొక్కను పెంచుకుంటారు. ఈ మొక్క శని దేవుడికి చాలా ప్రియమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా పూజించడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి. శని దేవుడి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. అయితే ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలున్నాయి.
ఈ పవిత్ర మొక్కను వాస్తు ప్రకారం ఇంట్లో సరైన దిశలో పెంచుకుంటే అది చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. జమ్మి మొక్కను తప్పు స్థలంలో లేదా దిశలో నాటడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కనుక వాస్తు ప్రకారం ఇంట్లో జమ్మి మొక్కను ఎక్కడ నాటాలి? దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాల గురించి తెలుసుకుందాం..
ఇంట్లో జమ్మి చెట్టును నాటడం.. దానిని సంరక్షించడం వల్ల కుటుంబ సభ్యులందరికీ సానుకూలత వస్తుందని నమ్ముతారు. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం ఈ మొక్కని నాటడానికి ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జమ్మి చెట్టు శనిదేవుడితో ముడిపడి ఉంది. అందువల్ల శనివారం దీనిని నాటడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాదు శని జయంతి, దసరా నవరాత్రులలో జమ్మి చెట్టును నాటవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోయి.. సానుకూల శక్తి వస్తుందని నమ్మకం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జమ్మి చెట్టును సరైన దిశలో నాటడం చాలా ముఖ్యం. జమ్మి చెట్టును ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి. ఇది ఉత్తమమైనది. లేదా ఈ మొక్కను ఇంటికి ఉత్తర దిశలో కూడా ఉంచవచ్చు. ఇది అనవసరమైన ఖర్చుల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. జమ్మి చెట్టును సరైన దిశలో నాటడం వల్ల ఇంటికి శ్రేయస్సు వస్తుందని, పేదరికం తొలగుతుందని నమ్మకం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జమ్మి చెట్టును పొరపాటున కూడా టాయిలెట్ లేదా బాత్రూమ్ సమీపంలో నాటవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు వంటగది దగ్గర ఈ చెట్టు పెంచడం నిషేధం. ఈ మొక్కను ఉంచే ప్రదేశం నీడగా లేదా చీకటిగా ఉండవద్దు. ఇలాంటి ప్రదేశాల్లో జమ్మి మొక్కను ఉంచడం అశుభంగా పరిగణించబడుతుంది.
జమ్మి చెట్టును ఇంటి ప్రధాన ద్వారం సమీపంలో పెంచడం మంచిది. వాస్తు ప్రకారం ఈ మొక్కను సూర్యరశ్మి పొందే ప్రదేశంలో ఉంచాలి. ఇది మొక్క అంతటా పచ్చగా ఉండేలా చేస్తుంది. పూర్తిగా ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులు, ఆకులు ఉన్న జమ్మి చెట్టును ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ఈ రకమైన మొక్క ఇంట్లోకి ప్రతికూలతను తీసుకురాగలదని నమ్ముతారు.
ఇంట్లో జమ్మి చెట్టును నాటడం, దానిని క్రమం తప్పకుండా పూజించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం ఈ మొక్క దగ్గర దీపం వెలిగించి “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడు. తన భక్తులకు ప్రత్యేక ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు.
ఇంట్లో జమ్మి చెట్టు నాటడం వల్ల పరిసరాల నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత నెలకొంటుంది. శని దోష ప్రభావం నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుంది. శనిదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు కుటుంబ సభ్యులపై ఉంటాయని నమ్ముతారు. ఈ మొక్క దురదృష్టాన్ని దూరం చేసి శ్రేయస్సును తెస్తుంది. శనీదేవుని ఆశీర్వాదం కారణంగా ఇంట్లో జమ్మి చెట్టును నాటడం వల్ల ఇంట్లో సభ్యుల అదృష్టం మారుతుంది. సంపద పెరుగుతుంది.

