The world’s largest nude cruise.. Travel without clothes for 11 days, ticket price is Rs. 43 lakhs

ప్రపంచంలోనే అతిపెద్ద నగ్న క్రూయిజ్ వచ్చే ఏడాది సముద్రంలోకి ప్రయాణించేందుకు సిద్ధం అవుతోంది. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా 2026 ఫిబ్రవరిలో ఈ బిగ్ న్యూడ్ బోట్‌ సముద్రంలో ప్రయాణించనుంది. ఇక ఇది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూడ్ క్రూయిజ్ కావడం గమనార్హం. ఈ క్రూయిజ్‌లో ప్రయాణికులు దుస్తులు లేకుండానే ప్రయాణించనున్నారు. ఇక ఈ క్రూయిజ్ షిప్‌లో 11 రోజులు ప్రయాణించేందుకు ఏకంగా రూ.43 లక్షలు టికెట్ ధరను నిర్ణయించారు. భారీ ధర ఉన్నప్పటికీ.. ప్రతీ సంవత్సరం వేలాది మంది అందుకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

సాధారణంగా క్రూయిజ్ షిప్ ‌లలో ప్రయాణాలు చేయాలని చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి.. సముద్రంపై వివిధ దేశాలు తిరుగుతూ అద్భుతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రూయిజ్ షిప్‌లలో ప్రయాణించాలంటే భారీగా టికెట్ ధర ఉంటుంది. లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి.. బయటికి వచ్చేవరకు అన్ని రకాల సౌకర్యాలు అందులో కల్పిస్తూ ఉంటారు. లగ్జరీ, స్టార్ హోటల్స్‌లో ఉండే సౌకర్యాలు మొత్తం ఈ క్రూయిజ్ షిప్‌లలో ఉంటాయి. రూ.లక్షలు, రూ.కోట్లు పెట్టి క్రూయిజ్ షిప్ టికెట్లు కొనుగోలు చేసి.. చాలా మంది ప్రపంచాన్ని సముద్రం మీదుగా చుట్టి వస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద న్యూడ్ క్రూయిజ్ షిప్.. ప్రయాణానికి రెడీ అవుతోంది. అంటే ఈ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణించేవారు ఒంటి మీద బట్టలు లేకుండా ప్రయాణించవచ్చు.

అమెరికాకు చెందిన బేర్ నెసెసిటీస్ అనే సంస్థ ఈ ప్రత్యేకమైన న్యూడ్ క్రూయిజ్‌ను తీసుకువస్తోంది. దీని ప్రధాన లక్ష్యం.. బట్టలు లేకుండా ప్రయాణాలు చేయాలని ఆసక్తి ఉండే వారికి ఒక వేదికను కల్పించడమేనని బేర్ నెసెసిటీస్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రూయిజ్ ప్రయాణంలో బట్టలు లేకపోవడం అనేది వ్యక్తిగత సౌకర్యం, స్వేచ్ఛ, నమ్మకానికి సంబంధించిందని చెబుతున్నారు. అయితే ఇది లైంగిక కార్యకలాపాలకు సంబంధించినది కాదని.. గౌరవం, బాడీ పాజిటివిటీ, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేస్తున్నారు.

ఈ క్రూయిజ్‌లో కొన్ని కఠినమైన నియమాలు

  • డైనింగ్ హాళ్లు, కెప్టెన్ రిసెప్షన్‌, సాంస్కృతిక కార్యక్రమాల సమయంలో, పోర్టుల్లో షిప్‌ను ఆపినపుడు బట్టలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.
  • కొన్ని ప్రాంతాల్లో నో ఫోటో జోన్స్ ఏర్పాటు చేయనున్నారు. అంటే స్విమ్మింగ్ పూల్స్, డ్యాన్స్ ఫ్లోర్ వంటి ప్రాంతాల్లో ఫోటోలు తీయడాన్ని పూర్తిగా నిషేధించారు.
  • ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే, ఎలాంటి రిఫండ్ లేకుండా ఎక్కడ పోర్టు వస్తే అక్కడే వారిని క్రూయిజ్ నుంచి తొలగిస్తారు.


		
		
			

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *