రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు రూ.6,400 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
AISF జిల్లా అధ్యక్షుడు గండు శివ డిమాండ్.
జులై 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాలు.

రాష్ట్ర వార్త : తెనాలి పట్టణం దేవిచౌక్ వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా పిజి విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 ని వెంటనే రద్దు చేయాలని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా పాశం వెంకటేష్ మరియు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్ ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. పెండింగ్లో ఉన్న 6400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకి, తల్లిదండ్రులకి , యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత తుతూ మంత్రంగా కేవలం 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ రాష్ట్రంలో 3900 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, ఆ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2600 కోట్ల రూపాయలు కేటాయించిందని. కేటాయింపు కేటాయింపుగా ఉండిపోయింది తప్ప ఇంతవరకు ఒక్క విద్యార్థికి ఒక రూపాయి విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందువలన విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద నుండి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,
ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక, మరో పనికి వెళ్లలేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ నెల జూలై 4 నుండి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, జులై 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే సబ్ కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చొరవ చూపాలని కోరామన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద తక్షణమే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు స్పందించిన సబ్ కలెక్టర్ వి సంజనా సింహ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అని తెలియజేశారు. లేని పక్షాన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ ఉపాధ్యక్షులు తేజ, కోశాధికారి ప్రదీప్, ఏఐఎస్ఎఫ్ తెనాలి నాయకులు యశ్వంత్, పవన్, పోట్లు, నవీన్ , సాయి, వివేక్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


