అమ్మ వారి సొమ్ము ఖజేశారు అనారోగ్యం పాలయ్యారు.

మీ సొమ్ము మాకొద్దు…అంటూ హుండీ డబ్బులు దేవాలయంలో పెట్టి పోయిన దుండగులు
అనంతపురం జిల్లా
బుక్కరాయ సముద్రంలో దొంగలు వింత పోకడిని ప్రదర్శించారు.
నెలరోజుల క్రితం బుక్కరాయ సముద్రం ముసలమ్మ దేవాలయంలో హుండీ చోరీకి గురైంది.
అయితే చోరి చేసిన నగదును దుండగులు నిన్నటి రాత్రి ఆలయ ఆవరణలో పడేసి వెళ్లిపోయారు.
నగదును వెలికితీసి పోలీసుల సమక్షంలో లెక్కింపు చేపట్టారు.
అయితే హుండీని తాము నలుగురు వ్యక్తులము కలసి చోరీ చేశామని దొంగలు లెటర్ రాసి మరి నగదును పడేసి వెళ్లారు
దొంగతనం చేసినప్పటి నుంచి తమ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని భయంతో అమ్మవారి డబ్బును ఆలయం దగ్గర వదిలేసి వెళ్లినట్లు దుండగులు ఒక లెటర్ రాసి సంచిలో వేసి వెళ్లిపోయారు.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు

