భయపెడుతున్న కాంచన 4 పాన్ ఇండియా బ్యూటీస్ …

రాష్ట్ర వార్త సినిమా :
బిగ్ స్క్రీన్ పై భయపెట్టడం ఒక కళ.. భయపడటం మరో కళ.. కామన్ గా భయపడే వారో.. భయపెట్టే వారో ఉంటారు.. కానీ భయపడుతూనే భయపెట్టడం ఆయనకే చెల్లుతుంది.. బాబోయ్ ఈ కొత్త భయం ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
హారర్ మూవీలతో హిట్లు కొట్టొచ్చని.. అది కూడా ఫ్రాంచైజీలుగా కూడా వచ్చి బాక్సాఫీస్ కొల్లగొట్టొచ్చని ప్రూవ్ చేసిన మూవీ ‘కాంచన’ (Kanchana ). రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరో కమ్ డైరెక్టర్ గా వచ్చిన ఈ మూవీలు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ఇప్పటికే మూడు భాగాలు వచ్చి ‘కాంచన ‘ అలరించింది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ కలెక్షన్లు అందుకున్నాయి. ‘కాంచన 3’ అయితే నేచురల్ స్టార్ నాని (Nani) ‘జెర్సీ’ (Jersey ) మూవీతో పోటీపడి మరీ భారీ వసూళ్లు అందుకుంది. అలాంటి ‘కాంచన ఫ్రాంచైజీ’పై బయటకు వచ్చిన ఓ అప్ డేట్ వైరల్ గా మారింది.
‘కాంచన 4’ ను త్వరలో తీసుకురాబోతున్నాడు రాఘవ లారెన్స్. ఇప్పటికే సగం షూటింగ్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ సారి భారీ బడ్జెట్‌తో.. అది కూడా పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ఖరారు చేసేందుకు టీం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మూవీకి కూడా రాఘవ లారెన్స్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సారి మూవీలో స్పెషల్ అట్రాక్షన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.
‘కాంచన4’లో రాఘవ లారెన్స్ తో పాటు పూజాహెగ్డే (Pooja Hegde ), రశ్మిక (Rashmika) నటించబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం ఉంది. అయితే వీరితో పాటు స్పెషల్ అట్రాక్షన్ గా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi )నటించబోతోందని చెప్పుకుంటున్నారు. 4 వ భాగాన్ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తుండటంతో.. కీలక రోల్ ఇస్తున్నారట. మొత్తానికి ఈ సారి ‘కాంచన4’ అంతకు మించి భయపెట్టబోతోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

