లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం – పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!
Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27 ఆరో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ…ఈ అలంకారం విశిష్టత ఇదే..

దసరా నవరాత్రులలో నాలుగొవ రోజు అమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.
త్రిపురాత్రయములో రెండొవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.
చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి సకల ఐశ్వర్యాభీష్టాలను సిధ్ధింపజేస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సమ్హార రూపిణి.
కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
పూజా విధానము:
శ్రీచక్రానికి కుంకుమార్చన, లలితా అష్టోత్తరము చేయవలెను.
మంత్రము:
“ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః” అనే మంత్రము 108 మార్లు జపించవలెను.
శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము విషయ సూచిక నందు కనుగొనగలరు.

