కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ డెయిరీదే కీలక పాత్ర.. ట్విస్టులే ట్విస్టులు..!
కల్తీ నెయ్యి వ్యవహారం సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ విచారణ వేగవంతం చేసింది. టీటీడీ ఉద్యోగులపై చర్యలు, హర్ష్ ఫ్రెష్ డెయిరీ జోడింపు, విపిన్ జైన్, పోమిల్ జైన్ కీలక పాత్రపై దృష్టి సారించింది.

కల్తీ నెయ్యి వ్యవహారం సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయ్యి విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే టీటీడీకి సంబంధించిన పలువురు ఉద్యోగులను విచారణ చేపట్టేందుకు తిరుపతి కోర్టు నుంచి.. నెల్లూరు ఏసీబీ కోర్టుకు కేసును బదిలీ చేయించుకుంది సిట్. దీంతో రోజు రోజుకు సిట్ విచారణ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సీబీఐ సిట్ విచారణలో ఇంటి దొంగలు ఎంతమంది పట్టుబడతారనే వివరాలు భయటకు రాకపోయినా.. కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిన సమయంలో ప్రొక్యూర్మెంట్ కార్యాలయంలో పనిచేసిన సిబ్బందికి సైతం సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఇదంతా ఓ ఎత్తు అయితే.. పోమిన్ జైన్, విపిన్ జైన్ లు కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. కల్తీ నెయ్యి జాబితాలో మరో డెయిరీని చేరుస్తూ సీబీఐ సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ కు చెందిన హర్ష్ ఫ్రెష్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును సిట్ చేర్చింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్లే హర్ష్ ఫ్రెష్ డెయిరీకి డైరెక్టర్లుగా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. విపిన్ జైన్, పోమిల్ జైన్ అసలు సూత్రధారులుగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీ ఉద్యోగులపై చర్యలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

News by : V.L
