Thai Mangur Fish: ఇండియాలో ఈ చేప బ్యాన్.. పొరపాటున తింటే పోతారు బాబోయ్..!

Thai Mangur Fish: కొన్ని జాతుల చేపలు తినడానికి పనికిరావు. అలాంటి వాటిలో ఒకటి డేంజరస్ థాయ్ మాంగూర్ ఫిష్. దీన్ని పెంచడం, అమ్మటం ఇండియాలో బ్యాన్ చేశారు. అంతేకాదు ఈ చేప చుట్టూ పెరిగే మిగతా చేపలు 70 శాతం మాయమైపోతాయి. అసలు ఈ చేప ఎందుకింత డేంజర్ ? పూర్తి వివరాలేంటో ఒకసారి తెలుసుకుందాం.చాలా మంది ఫేవరేట్ ఫుడ్‌లో ఫిష్ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, నదులు ఎక్కువగా ఉండే ప్రాంతాల వారికి చేపలు, సీఫుడ్ అంటే ప్రాణం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి మంచివి. అయితే అన్ని రకాల చేపలు మంచివి కావు. కొన్ని జాతుల చేపలు తినడానికి పనికిరావు. అలాంటి వాటిలో ఒకటి డేంజరస్ థాయ్ మాంగూర్ ఫిష్ (Thai Mangur Fish). దీన్ని పెంచడం, అమ్మటం ఇండియాలో బ్యాన్ చేశారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా దొరుకుతోంది. మరి దీన్ని ఎందుకు బ్యాన్ చేశారు? వచ్చే హెల్త్ రిస్క్ ఏంటి? పూర్తిగా తెలుసుకుందాం.<strong>క్యాన్సర్ రిస్క్ (cancer risk)..:</strong> టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. థాయ్ మాంగూర్ ఫిష్ క్యాన్సర్ రిస్క్‌ను (Thai Mangur Cancer Risk) పెంచుతుందని అలీఘర్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ తింటే క్యాన్సర్ ప్రియాంక ఆర్య హెచ్చరించారు. ఈ చేప పెరిగే వాతావరణం, వాటికి పెట్టే ఫుడ్ చాలా అపరిశుభ్రంగా ఉంటాయి. లాభాల కోసం రైతులు ఈ చేపలకు కుళ్లిపోయిన మాంసం, ఇతర వేస్ట్ ఫుడ్ మిక్స్ చేసి పెడతారు. పందుల వేస్ట్, డ్రెయినేజ్ వాటర్ కూడా వాడుతున్నట్లు తెలిసింది. ఇలాంటి చర్యల కారణంగా ఈ చేపల శరీరాల్లో హానికరమైన బ్యాక్టీరియా, కెమికల్స్ చేరతాయి. దీన్ని తింటే మనుషులకు హాని చేస్తుంది. అలాగే, వీటిని పెంచే వాటర్ బాడీస్‌ను చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తుంది. ఇవి నిల్వ ఉన్న నీటిలో ఎక్కువగా పెరుతాయి. కాబట్టి, వర్షాకాలంలో హెల్త్ రిస్క్ మరింత ఎక్కువ. అందుకే వీటిని తింటే కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువ.<strong>70 శాతం స్థానిక చేపలు మాయం..:</strong> థాయ్ మాంగూర్ (Thai Mangur) కేవలం మనుషుల ఆరోగ్యానికే కాదు. ఇండియాలోని వాటర్ ఎకోసిస్టమ్‌కు కూడా పెద్ద ముప్పు. ఇది ఒక మాంసాహార జాతి. దీని ఆహారపు అలవాట్ల వల్ల నీటిలో ఉన్న చిన్న చిన్న స్థానిక చేపలను వేటాడి తినేస్తుంది. రీసెర్చ్ ప్రకారం.. ఈ చేపల వల్ల స్థానిక చేపల జాతులు 70 శాతం తగ్గిపోయాయి. ఇది ఇండియాలోని చెరువులు, నదుల బయోడైవర్సిటీని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతేకాకుండా ఈ చేప సాధారణంగా ఫిష్‌లైస్ లాంటి పారాసైట్‌లను మోసుకెళ్తుంది. ఇవి ఎపిజూటిక్ ఔట్‌బ్రేక్స్‌కు దారి తీస్తాయి. అంటే, అకస్మాత్తుగా వ్యాధులు వచ్చి మొత్తం ఫిష్ పాపులేషన్ నాశనం అవుతుంది.<strong>అందుకే ఇంపోర్ట్ చేసుకున్నారు..:</strong> థాయ్ మాంగూర్ చేప ఒక హైబ్రిడ్ క్యాట్‌ఫిష్ (Thai Mangur Cat Fish). ఇది వేగంగా పెరుగుతుంది. ఎలాంటి వాతావరణానికైనా త్వరగా అడ్జస్ట్ అవుతుంది. అందుకే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. 2000 సంవత్సరం నుంచే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ద్వారా దీని పెంపకాన్ని నిషేధించింది. ఈ చేప మాంసాహార స్వభావం, ఎకోసిస్టమ్‌కు కలిగించే నష్టం ప్రధాన కారణాలు. దీనిని పెంచడం, అమ్మడం, కొనడం పూర్తిగా అక్రమం. దీన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు రైడ్స్ చేసి చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్ హెల్త్, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు.

