తెలుసు కదా పబ్లిక్ టాక్.. ఇద్దరు బ్యూటీలతో సిద్దు రొమాంటిక్ రైడ్ ఎలా ఉందంటే..!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా సినిమా ‘తెలుసు కదా’. శుక్రవారం (అక్టోబర్ 17) ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దామా..యూత్‌లో ప్రస్తుతం మంచి పాపులారిటీ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా సినిమా ‘తెలుసు కదా’. శుక్రవారం (అక్టోబర్ 17) ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. రిలీజ్‌కు ముందే ఏర్పడిన క్రేజ్ కారణంగా పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేశారు. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందన కనిపిస్తోంది.
ఈ సినిమా చూసిన వారు ఇది “సిద్ధు వన్ మ్యాన్ షో!” అని కామెంట్లు చేస్తున్నారు. స్క్రీన్‌పై ఆయన ఎనర్జీ, ఎమోషనల్ రేంజ్ ని చక్కగా చూపించాడని నెటిజన్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా వరుణ్ పాత్రలో సిద్ధుని క్యారక్టరైజేషన్ కొత్తగా, కాస్త విచిత్రంగా అనిపించినా, ఇంటర్వెల్‌కు చేరేసరికి ఆ పాత్ర పూర్తిగా కనెక్ట్ అవుతుందని చెప్పుతున్నారు. బాధ, కోపం, గిల్ట్ వంటి భావోద్వేగాలను ఆయన సమతుల్యంగా ప్రదర్శించాడని ప్రశంసలు అందుతున్నాయి.
