ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న తెలుగు స్టార్ హీరోయిన్.. రెండో బిడ్డకి ఆరు నెలలు నిందకముందే..

తెలుగు స్టార్ హీరోయిన్ ముచ్చటగా మూడోసారి ప్రెగ్నెంట్ కావడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిస్తోంది. దాదాపు అందరూ తెలుగు స్టార్ హీరోలతో నటించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు తన రెండో బిడ్డకి ఆరు నెలలు ఉన్నప్పుడే మరోసారి ప్రెగ్నెంట్ అయింది.. ఇంతకీ ఆమె ఎవరు అంటే ..
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో.. నటించిన హీరోయిన్ ఇలియానా. ముఖ్యంగా ఈ హీరోయిన్ నటించిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
రామ్ దేవదాసు సినిమాతో.. ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే రానా నా రాక్షసి సినిమా తరువాత ఈ హీరోయిన్ పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
ఇక బర్ఫీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. అక్కడ సైతం కొన్ని సినిమాలలో కనిపించి మెప్పించింది. కానీ ఉన్నట్టుంది పెళ్లి చేసేసుకొని సినిమాలకు కనుమరుగయ్యింది.
ఇక ఇలియానా మధ్యలో కొద్దికాలం డిప్రెషన్ లోకి వెళ్ళాను అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. అయితే ఇలియానాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అందులో ఇలియానా రెండో బిడ్డకి ఇప్పుడు కేవలం 6 నెలలు మాత్రమే.. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రెండో బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెడుతూ.. ఇలియానా బేబీ బంప్ వేసుకుని తిరుగుతున్న వీడియో వైరల్ అవుతోంది.
