తెలుగు సినిమాలు OTT:జనవరి లాస్ట్ వీక్‌లో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్.. ఓ లుక్కేయండి!
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, హులు వంటి వేదికలపై పలు భాషల్లో వినోదభరిత కంటెంట్ స్ట్రీమింగ్కు రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4 పార్ట్ 1’, ‘చాంపియన్’, ‘ధురంధర్’ విడుదల కానుండగా, ప్రైమ్ వీడియోలో ‘డల్డల్’ సిరీస్ అందుబాటులోకి వస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ‘గుస్తాఖ్ ఇష్క్’, ‘సర్వం మాయ’ సినిమాలు స్ట్రీమింగ్కు రానున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సన్‌నెక్ట్స్‌లో ‘పతంగ్’ విడుదల కానుంది. ఈ లిస్ట్ వీకెండ్ బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్ గైడ్‌గా నిలవనుంది.
ఇటీవలి కాలంలో థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకుల ప్రధాన వినోద కేంద్రాలుగా మారాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే కాదు… పాన్ ఇండియా, అంతర్జాతీయ కంటెంట్ కూడా ఒకే చోట అందుబాటులో ఉండటం ఓటీటీల ప్రత్యేకతగా మారింది. వీకెండ్ బింజ్ వాచ్ కోసం సినీ అభిమానులు ఎదురు చూసేలా ఈ వారం కూడా ప్రముఖ ఓటీటీ వేదికలు సరికొత్త వినోదంతో సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, హులు, సన్‌నెక్ట్స్, జీ5, సోనీలివ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.