Teeth Whitening Tips: కేవలం రెండే నిమిషాల్లో మీ పళ్లను మెరిపించండిలా..

శరీరంలో ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు. నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. శరీర భాగాల్లో నోరు ముఖ్య పాత్ర వహిస్తుంది. తినే ఆహారం నోటి ద్వారానే శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నోటి నుంచి దుర్వాసన లేకుండా దంతాలు తెల్లగా ఉంటేనే ఆత్మ విశ్వాసంతో ఎదుటివారితో మాట్లాడటం లేదా నవ్వడం జరుగుతుంది. దంతా ఆరోగ్యం.. శరీర ఆయుష్షు కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పళ్లను ఉదయం, రాత్రి రెండు..
రీరంలో ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు. నోటి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. శరీర భాగాల్లో నోరు ముఖ్య పాత్ర వహిస్తుంది. తినే ఆహారం నోటి ద్వారానే శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నోటి నుంచి దుర్వాసన లేకుండా దంతాలు తెల్లగా ఉంటేనే ఆత్మ విశ్వాసంతో ఎదుటివారితో మాట్లాడటం లేదా నవ్వడం జరుగుతుంది. దంతా ఆరోగ్యం.. శరీర ఆయుష్షు కూడా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పళ్లను ఉదయం, రాత్రి రెండు పూటలా తోముకోవాలని అంటారు. దంతాలను ఎంత శుభ్రం చేసినా కొంత మందికి పసుపు పచ్చ రంగులోనే ఉంటాయి. దీంతో వీరు మాట్లాడటానికి ఆలోచిస్తూ ఉంటారు. దీనికి మెడిసన్ కంటే.. ఇంట్లో ఉండే రెమిడీస్ ఎంతో సహాయ పడతాయి. మన ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులతో మీ దంతాలను మిలమిలమని మెరిపించవచ్చు. దీంతో మీరు కూడా ఆత్మ విశ్వాసంతో ఉండగలుతారు. దంతాలను తెల్లగా మార్చే ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే దంతాల పచ్చదనం పోగొట్టడంలో కూడా కొబ్బరి నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల్లో పేరుకున్న బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. ప్రతి రోజూ పళ్లు తోముకున్న తర్వాత.. దంతాలపై కొబ్బరి నూనె రాసి బాగా రుద్దండి. ఇలా ఓ ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోండి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే.. నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
నిమ్మకాయ:
మన ఇంట్లో ఎక్కువగా లభ్యమయ్యే వస్తువుల్లో నిమ్మ కాయ కూడా ఒకటి. నిమ్మకాయతో దంతాల పసుపు పచ్చ మరకలను సులభంగా వదిలించుకోవచ్చు. ఇంది ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. కొద్దిగా నిమ్మ రసంలో బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పళ్లపై రాసి బాగా రుద్దండి. ఇలా చేయడం వల్ల మీ దంతాల్లో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు.
నారింజ తొక్క:
దంతాలు తెల్లబడటానకి నారింజ తొక్క కూడా బాగా సహాయ పడుతుంది. ఆరెంజ్ తొక్కతో పళ్లను బాగా రుద్దండి. ఇలా చేస్తే పళ్లపై పేరుకున్న ఫలకాలు తొలగి.. దంతాలు బాగా మెరుస్తాయి. నారింజ తొక్క ఎండబెట్టి పొడిలా చేసుకుని.. పేస్ట్ లా కూడా ఉపయోగించవచ్చు.

