Sweating: మీకు విపరీతంగా చెమట పడుతోందా.. అయితే ఆ ప్రాబ్లం ఉండొచ్చు! బీ అలర్ట్ బ్రో!

Sweating: మీకు ఎక్కువగా చెమట పడుతుందా? అయితే ఆ ప్రాబ్లం ఉండొచ్చు! బీ అలర్ట్ బ్రో! Sweating: కొంత మందికి చాలా ఎక్కువగా చెమట పడుతుంది. వాతావరణం అనుకూలంగానే ఉన్నా సరే చెమటతో డ్రెస్ తడిసిపోతుంది. ఇలా ట్రావెలింగ్‌లో ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్‌లో జరిగితే చాలా చిరాకుగా ఉంటుంది. కానీ ఇది మన బాడీని కూల్‌గా ఉంచే ఒక నేచురల్ ప్రాసెస్. ఎండ వల్ల వచ్చే స్ట్రోక్, ఇతర సమస్యల నుంచి చెమట మనల్ని కాపాడుతుంది.చెమట పట్టడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్, మురికి, డెడ్ స్కిన్ సెల్స్, బ్యాక్టీరియా బయటకు పోతాయి. అయితే ఎక్కువ చెమట పట్టడం కొన్నిసార్లు స్కిన్‌కు అంత మంచిది కాదు. తేమ తగ్గిపోయి స్కిన్ డ్రైగా మారడం, ఇరిటేషన్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, డెర్మటైటిస్ లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. చెమట వల్ల ప్రయోజనాలు
యాంటీమైక్రోబియల్ గుణాలు: చెమట వల్ల స్కిన్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. ఇది స్కిన్‌కు మంచి షైనింగ్‌ను ఇస్తుంది. స్వేధ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, ఆయిల్, వ్యర్థాలను చెమట బయటకు పంపేస్తుంది. చెమటలోని ఉప్పు వల్ల దానికి యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్:
చెమట వల్ల చర్మానికి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఇది స్కిన్‌ను హెల్తీగా, షైనీగా మారుస్తుంది. చెమటలోని తేమ చర్మంపై నుంచి డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది. మొటిమలు ఉన్నవారికి ఎక్కువ చెమట పడితే మంచిదే. స్కిన్ హైడ్రేషన్:
శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో చెమట సహాయపడుతుంది. హానికరమైన విష పదార్థాలు లేక మలినాలను చర్మం నుంచి, ఇమ్యూనిటీ సిస్టమ్ నుంచి బయటకు పంపేస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతుంది. అధిక చెమట వల్ల దుష్ప్రభావాలు
ఎక్కువ చెమట పడితే చర్మంపై ఉండే రక్షణ పొర బలహీనపడే అవకాశం ఉంది. చెమటలో ఉండే మినరల్ సాల్ట్స్ (లవణాలు), లాక్టిక్ యాసిడ్ కాలక్రమేణా చర్మంలోని సహజ మాయిశ్చరైజింగ్ పదార్థాలైన సెరమైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, హైలురోనిక్ యాసిడ్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.అలానే ఎక్కువ చెమట పడితే డెర్మటైటిస్ (చర్మం వాపు), ఇరిటేషన్, పొడిబారడం (డ్రై అవ్వడం), దురద (ప్రురిటస్) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చెమటలోని ఉప్పు, గాయాలు ఉన్న చోట పడినప్పుడు మంటను కలిగించవచ్చు. ఎక్కువ చెమట పట్టడం లేక అస్సలు చెమట పట్టకపోవడం రెండూ ఆందోళన కలిగించే విషయాలే. ఎక్కువ చెమట (హైపర్హైడ్రోసిస్ అని కూడా అంటారు) వల్ల అథ్లెట్స్ ఫుట్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బాడీ అడోర్, అరి చేతుల్లో బాగా చెమట పట్టడం లాంటి సమస్యలు వస్తాయి. చెమటను ఎలా నియంత్రించాలి?
చెమట వల్ల వచ్చే సమస్యలను నివారించడానికి సరైన శుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. సున్నితమైన, సువాసన లేని క్లెన్సర్‌తో స్నానం చేయాలి. ఇది చర్మంపై పేరుకుపోయిన చెమట, మురికి, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. స్నానం చేసిన తర్వాత మంచి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇది చర్మ రక్షణ పొరను తిరిగి ఏర్పడేలా చేస్తుంది. తగినన్ని నీళ్లు తాగడం, చర్మానికి మంచి చేసే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

