మొటిమల సమస్యలకు సూపర్ హోం రెమెడీ! రెగ్యూలర్‌గా చేశారంటే చందమామ లాంటి అందం!!
రాష్ట్రవార్త ఆరోగ్యం:

ఖరీదైన, కెమికల్ ఆధారిత ఉత్పత్తులు అందరికీ పనిచేయవు. అందుకే, ముఖ సంరక్షణ కోసం ఇంట్లోనే సింపుల్ రెమెడీస్‌తో చర్మాన్ని మెరుగుపరచొచ్చునని ఆరోగ్య నిపుణులు, బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఇందుకోసం శెనగపిండితో చేసే ఫేస్‌ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ముఖంలో మొటిమలు నివారించే అద్భుత ఫేస్‌ప్యాక్ ఇది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…
నేటి బిజీ లైఫ్‌లో ముఖ సంరక్షణకు సమయం దొరకడం లేదు. దాంతో యువతులు ఎక్కువగా మొటిమలు, చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారం కోసం మార్కెట్ లభించే రకరకాల కెమికల్ ఆధారిత ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. అయితే, ఇలాంటి ఖరీదైన, కెమికల్ ఆధారిత ఉత్పత్తులు అందరికీ పనిచేయవు. అందుకే, ముఖ సంరక్షణ కోసం ఇంట్లోనే సింపుల్ రెమెడీస్‌తో చర్మాన్ని మెరుగుపరచొచ్చునని ఆరోగ్య నిపుణులు, బ్యూటీషియన్లు చెబుతున్నారు. ఇందుకోసం శెనగపిండితో చేసే ఫేస్‌ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…
ముఖంలో మొటిమలు నివారించే అద్భుత ఫేస్‌ప్యాక్ ఇది. ఇదుకోసం శెనగపిండి, పసుపు ఉంటే కూడా సరిపోతుంది. ఈ రెండింటితో చౌకగా ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ వాష్ మీ ముఖ సౌందర్యాన్ని మెరుగు చేస్తాయి. ఇందుకోసం శెనగపిండి లో పసుపు వేసుకుని సరిపడా నీళ్లు కలుపుకుని చిక్కటి మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై చక్కగా అప్లై చేయాలి. ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్ చేసుకోవాలి.
పసుపులోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. శెనగపిండి చర్మాన్ని శుభ్రపరచి మృతకణాలను తొలగిస్తుంది. రెగ్యులర్‌గా వాడితే నేచురల్ గ్లో వస్తుంది. మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇంకా కావాలంటే శనగపిండిలో పసుపు, రోజ్ వాటర్‌తో కూడా ఈ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే త్వరలోనే మంచి రిజల్ట్ ఉంటుంది. వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

